హైదరాబాద్ లో మరో ప్రముఖ సంస్థ తన బల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని ఏర్పాటు చేయనుంది. నెస్లే గ్రూప్ షేర్డ్ సర్వీసెస్ విభాగమైన నెస్లే బిజినెస్ సర్వీసెస్ (NBS) ఇండియాలోని తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది. తమ కంపెనీ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో, వివిధ ప్రాంతాలలో విస్తృత సేవలను అందించడానికి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సామర్థ్యాలను నిర్మించడంలో ఈ జీసీసీ ఏర్పాటు ముందడుగు అని కంపనీ పేర్కొంది.
నెస్లే బిజినెస్ సర్వీసెస్ భారతదేశంలో ప్రారంభిస్తున్న మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ గా హైదరాబాద్ జీసీసీ నిలవనుంది. కాగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నెస్లే బిజినెస్ సర్వీసెస్, నెస్లే బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏజెంటిక్, అధునాతన టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అయిన జెన్‌ప్యాక్ట్ భాగస్వామ్యంతో స్థాపించనున్నారు. జెన్‌ప్యాక్ట్ తన ప్రాసెస్ ఇంటెలిజెన్స్, డేటా, ఏఐ, ఆటోమేషన్‌లోని నైపుణ్యాన్ని అందించి, నెస్లే తన వ్యాపార సేవలను సరళీకరించడానికి ఈ జీసీసీ ఉపయోగపడనుంది.
నెస్లే వృద్ధి ప్రయాణంలో ఎన్‌బిఎస్ హైదరాబాద్ ఒక సానుకూలమైన ప్రాతమని కంపెనీ తెలిపింది. భారత్ వంటి మార్కెట్‌లో తమ బలమైన సామర్థ్యాలను పెంపొందించుకుంటున్నప్పుడు, ఈ ప్రయాణంలో తమ సిబ్బంది, భాగస్వాములు, విక్రేతలు కీలకంగా ఉంటారని పేర్కొంది. హైదరాబాద్‌లో బలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని నెస్లే బిజినెస్ సర్వీసెస్ అధిపతి లూకా ఫిచెరా తెలిపారు. భారతదేశంలోని ప్రముఖ గ్లోబల్ సామర్థ్య గమ్యస్థానాలలో ఒకటిగా హైదరాబాద్ ఉందని.. అందుకే జీసీసీ ఏర్పాటు కోసం ఈ నగరాన్ని ఎంపిక చేశామని కూడా ఆయన అన్నారు.
"హైదరాబాద్ బలమైన ఎకోసిస్టమ్, జెన్‌ప్యాక్ట్ నైపుణ్యంతో, మేము మరింత ఎక్కువ విలువ, స్థిరత్వం, ఆవిష్కరణలను అందించడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం, ప్రపంచవ్యాప్త కార్యకలాపాలలో పనితీరు, స్థితిస్థాపకత, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి డొమైన్ నైపుణ్యం, ప్రాసెస్ ఇంటెలిజెన్స్, డేటా, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఆపరేషన్స్ సామర్థ్యాలను ఒకచోట చేర్చనుంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెస్లేకు ఒక ముఖ్యమైన ప్రతిభ, సామర్థ్య స్థావరంగా ఇండియా పాత్రను ఇది బలోపేతం చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ అనేక అంతర్జాతీయ సంస్థలు తమ జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ త్వరలోనే జీసీసీలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది.
More Articles
- Gold Price Today: శాంతించిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
- Hyderabad: హైదరాబాదీలకు షాక్.. ఇక నీరు దోరకడం కష్టమే..!
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఈ ఏరియాల్లో రోడ్ల విస్తరణకు HMDA మాస్టర్ ప్లాన్..
- భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ.. మరో హైదరాబాద్ కానున్న ఉత్తరాంధ్ర.. ఆగస్టు 1న ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
- ముగిసిన తాజ్ బంజారా హోటల్ ప్రస్థానం.. 40 అంతస్తుల భవనంగా మళ్లీ రీఎంట్రీ.. ఇంకో విషయం ఏంటంటే..
- హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ అక్రమాస్తుల చిట్టా ఇదిగో.. కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సంపాదన..