మెటా ప్లాట్‌ఫారమ్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM), డీప్‌ఫేక్‌లపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేశారు. మెటా గ్లోబల్ టీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మధ్య బుధవారం చర్చల తర్వాత మెటా నుంచి ఈ ప్రకటన వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించడంపై ప్రభుత్వం ఇటీవల కంపెనీకి సమన్లు ​​పంపిన సంగతి తెలిసిందే. బుధవారం గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్‌తో సహా మెటా ప్రతినిధులు అశ్విని వైష్ణవ్ ను కలిశారు. ఐటి సెక్రటరీ ఎస్.కృష్ణన్‌తో కూడా ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో చెల్లింపు ప్రకటనలలో CSAM ఉండటంపై సోషల్ మీడియా దిగ్గజంపై కేంద్ర మండిపడింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెలలో ప్రభుత్వం మెటాకు నోటీసు జారీ చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా, ఇలాంటి సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి మెటా సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉండాలని ఐటీ కార్యదర్శి కృష్ణన్ అన్నారు. ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా భారతీయ చట్టాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశ యువతను ఉద్దేశించి పరీక్ష పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ పీఎం మోదీ పోస్ట్‌ను పరిమితం చేయడంపై ప్రశ్నించారు. మెటా ఈ సంఘటనను సాంకేతిక లోపంగా అభివర్ణించి క్షమాపణలు కోరింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వివరణ సరిపోదని స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి మోదీ, ఇతర ప్రముఖ ఖాతాల నుంచి వచ్చే పోస్ట్‌లు ప్లాట్‌ఫారమ్‌లో మెరుగైన పరిశీలనకు లోనవుతాయని మెటా పేర్కొంది. ఇందులో సీనియర్ కంపెనీ అధికారుల సమీక్షలు బహుళ స్థాయిలలో ఉంటాయని మెటా ఐటీ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ప్రధానమంత్రి పోస్ట్ చేసిన కంటెంట్, ఇతర ఉన్నత స్థాయి ఖాతాల కోసం జూలై 28న ప్రవేశపెట్టిన అదనపు, కఠినమైన భద్రతల వివరాలను కూడా కంపెనీ షేర్ చేసింది.

మోదీ జూలై 23 ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. యువకులతో కనెక్ట్ అవ్వడానికి, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తూ మోదీ వీడియో షేర్ చేశారు. ఈ పోస్ట్ ను ఫేస్ బుక్ తాత్కాలికంగా పరిమితం చేసింది. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.