90ల్లో పుట్టిన దాదాపు అందరికీ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరే వాడుంటారు. జాన్సన్ అండ్ జాన్స్ బేబీ పౌడర్ అప్పుడు అంతా ఫేమస్. 2010 వరకు అండ్ జాన్సన్ బేబీ పౌడర్ కు బాగానే వాడేవారు. అయితే ఈ కంపెనీ తయారు చేసిన టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ బాధితులు కోర్టుకు వెళ్లారు. దీంతో కంపెనీపై తీవ్ర ప్రభావం పడింది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఆ సంస్థ జాన్సన్ & జాన్సన్ (J&J) తెరదించింది. కంపెనీ టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ బాధితులు వేసిన వేల కేసులను పరిష్కరించుకునేందుకు ఏకంగా 5.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు కంపెనీ సిద్ధమైంది.

Advertisement

భారత కరెన్సీలో వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు సంస్థ అంగీకరించింది. దీంతో దశాబ్దాలుగా కంపెనీని వేధిస్తున్న ఈ న్యాయ పోరాటానికి ఈ ఒప్పందంతో ఫలితం లభించింది. న్యూజెర్సీ కోర్టుతో పాటు ఇతర రాష్ట్రాల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దాదాపు 76 వేల క్లెయిమ్‌లకు ఈ ఒప్పందం వర్తించనుంది. కంపెనీపై మిగిలి ఉన్న దాదాపు అన్ని కేసులకు దీనివల్ల పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. టాల్క్‌లో ఆస్బెస్టాస్ ఉండి మెసోథెలియోమా క్యాన్సర్ సోకిందన్న కేసులను కంపెనీ ఎప్పుడో సెటిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే కోర్టులో ఉన్న అండాశయ క్యాన్సర్ బాధితుల్లో కనీసం 95 శాతం మంది ఈ ఒప్పందానికి అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ సెటిల్మెంట్ పూర్తిగా అమలు కానుంది. దీనికి సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్ 2027లో 3 బిలియన్ డాలర్లు, ఆ తర్వాత 2028లో మిగతా మొత్తం చెల్లించాలని చూస్తోంది. బాధితుల స్పందనను బట్టి ఈ మొత్తం భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ మొత్తం $7 బిలియన్ల వరకు కూడా చేరవచ్చని భావిస్తున్నారు. కేవలం 18 నెలల్లోపే బాధితులందరికీ డబ్బులు అందేలా వేగంగా ఈ ప్రక్రియ జరగనుంది.

Advertisement

మా పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ మొదటి నుంచి ఖండిస్తూనే ఉంది. టాల్క్ పౌడర్ పూర్తిగా సురక్షితమైనదని వాదిస్తోంది. అయిన, ఈ వివాదానికి ముగింపు పలికి.. ప్రాణాలు కాపాడే ఇతర మందులు, వైద్య పరికరాల తయారీపై దృష్టి పెట్టేందుకే ఈ రాజీకి ఒప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఒప్పందం కేవలం ఇప్పటివరకు ఉన్న కేసులకు మాత్రమే వర్తిస్తుందని.. భవిష్యత్తులో వచ్చే కొత్త కేసులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ వివాదాల నేపథ్యంలో జే&జే సంస్థ 2020లోనే అమెరికాలో టాల్క్ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.