ఏఐ రాకతో భారత ఐటీ పరిశ్రమ తీవ్ర ఒత్తడిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ కంపెనీలపై ప్రభావం పడుతోంది. ఇన్నీ ఆందోళనల మధ్య మంగళవారం ఐటీ సూచీ 3 శాతం పెరిగింది. జెఫరీస్ ఈ రంగాన్ని అండర్‌వెయిట్ నుంచి న్యూట్రల్ కు అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, రెండు సెషన్లలో ఐటీ ఇండెక్స్ 6 శాతం పెరిగింది. బుధవారం ఫెడ్ తన విధాన నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో ఈ లాభాలు నమోదయ్యాయి. ఆ రోజు ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని విస్తృతంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఉధృతి తగ్గడం, దెబ్బతిన్న భారతదేశపు ఐటీ రంగానికి తిరిగి నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పిస్తోందని నెక్స్‌ఎడ్జ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ గౌరవ్ కులశ్రేష్ఠ తెలిపారు.
రుణ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మూలధన వ్యయం, పెట్టుబడిపై రాబడికి సంబంధించిన అనిశ్చితి పెరుగుతున్న భయాల కారణంగా తూర్పు ఆసియా టెక్నాలజీ కేంద్రాలలో తీవ్రమైన అమ్మకాలు జరుగుతున్నప్పటికీ, భారతదేశ టెక్నాలజీ సేవల రంగం అద్భుతమైన స్థితిస్థాపకతను ప్రదర్శించింది. దక్షిణ కొరియా, తైవాన్, జపాన్‌లలోని సెమీకండక్టర్ దిగ్గజాలు, హార్డ్‌వేర్ సరఫరాదారులు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌టెక్ వంటి ప్రధాన భారతీయ ఐటీ ఎగుమతిదారులు దూసుకెళ్లాయి. సూచీలో నాలుగు ప్రధాన ఐటీ స్టాక్‌లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా రాణించాయి.
తాజా ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.5 శాతానికి పైగా పెరిగి, 30,500 మార్కు సమీపంలో ముగిసింది. గత కొన్ని నెలలుగా తీవ్రమైన పతనం తర్వాత ఈ సూచీ పుంజుకుంది. అత్యధిక లాభాలు ఆర్జించిన వాటిలో TCS 3 శాతనికి పైగా పెరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్ నిలిచాయి. ఈ జోరు కేవలం ప్రధాన కంపెనీలకే పరిమితం కాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరించింది. ఇందులో కోఫోర్జ్ దాదాపు 9 శాతం పెరగ్గా, ఎంఫసిస్ 4.5%కి పైగా, Persistent Systems దాదాపు 4% మరియు LTIMindtree 3%కి పైగా పెరిగాయి.
ప్రపంచ చిప్ తయారీదారులను, ఏఐ-కేంద్రీకృత టెక్నాలజీ సంస్థలను రికార్డు స్థాయి విలువలకు చేర్చిన ఏఐ మౌలిక సదుపాయాల విజృంభణలో భారతీయ ఐటీ కంపెనీలకు చెప్పుకోదగ్గ ప్రమేయం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల వలె కాకుండా, భారతీయ ఐటీ కంపెనీలు ఏఐ చిప్‌ల తయారీ లేదా ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కంటే, తమ ఆదాయంలో అధిక భాగాన్ని సాంప్రదాయ ఐటీ సేవలు, డిజిటల్ పరివర్తన, క్లౌడ్ మైగ్రేషన్, కన్సల్టింగ్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ నుంచి పొందుతున్నాయి. ఇప్పుడు భారత కంపెనీలు కూడా ఏఐపై దృష్టి సారిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- టైమ్-ట్రాకింగ్ విధానంపై ఇన్ఫోసిస్‌కు భారీ షాక్.. రూ. 2 కోట్ల జరిమానా విధించిన ఫ్రెంచ్ కార్మిక సంస్థ..
- Infosys: తమ సంస్థలో పని చేసిన డ్రైవర్లు, సహాయ సిబ్బందిని కోటీశ్వరులను చేసిన ఇన్ఫోసిస్..!
- Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ షేర్లు..!
- ఇన్ఫోసిస్‌కు కొత్త బాస్.. సలిల్ పరేఖ్ రాజీనామా.. కొత్త CEOగా ఆశిష్ కుమార్ దాస్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే ..
- ఐటీ షేర్లు: ఒక్కసారిగా లాభాల జోరు! అసలు రహస్యం ఇదేనా?
- TCS: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టీసీఎస్ స్టాక్.. మిగతా ఐటీ స్టాక్స్ కూడా..!