ప్రపంచవ్యాప్తంగా సంతాన లేమి సమస్యలు పెరుగుతోన్నాయి. దేశంలో కూడా సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. చాలా మందికి పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదు. దీంతో వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకప్పుడు ఐవీఎఫ్ సెంటర్లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లు భారీగా వస్తున్నాయి. ఒకప్పుడు ఐదు నుంచి పది మందిని కన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కరు పుట్టడమే గగనంగా మారింది. ప్రస్తుత జీవన శైలి, తీసుకునే ఆహారం వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యలు వస్తున్నాయి. మగ వారిలో కూడా శక్తి తగ్గిపోతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతుంది. అంతే కాదు వాటీ వేగం కూడా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
పెళ్లై రెండు మూడు ఏళ్ల వరకు పిల్లలు కాకపోతే.. వైద్యులకు చూపించుకుంటున్నారు. మొదట మందులు వాడుతున్నారు. తర్వాత ఐయూఐ చేయించుకుంటున్నారు. అయినా పిల్లలు కాకపోతే ఐపీఎఫ్ సెంటర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐవీఎఫ్(IVF) సెంటర్లకు గిరాకీ భారీగా పెరుగుతోంది. దీంతో హైదరాబాద్ లో ఐవీఎఫ్ సెంటర్లు భారీగా పెరిగాయి. ఐపీఎఫ్ చికిత్సకు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలు అవుతాయని చెబుతున్నారు. అదే అమెరికాలో ఐవీఎఫ్ చికిత్స భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. భారత కరెన్సీ ప్రకారం రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు.
ఇలానే ఓ జంట మొదట అమెరికాలోని ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్లారు. వారు రూ.35 లక్షలు చికిత్సకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే హైదరాబాద్ లో ఈ చికిత్సకు తక్కువ డబ్బులు అవుతాయని తెలుసుకున్న ఆ జంట హైదరాబాద్ లోని ఓ ఐవీఎఫ్ సెంటర్ ను సంప్రదించింది. ఈ క్రమంలోనే దంపతులు హైదరాబాద్ రావాలనుకున్నారు. అయితే ఇద్దరు ఒకేసారి హైదరాబాద్ రాలేకపోయారు. ముందుగా భర్త వచ్చి వీర్యాన్ని ఇచ్చి వెళ్లాడు. ఆ తర్వాత భార్య వచ్చి ఎగ్ రిడ్రీవల్, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ పూర్తి చేసుకుంది. ఈ ఒక్క జంటే కాదు.. చాలా మంది జంటలు హైదరాబాద్ కు ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ కు వస్తున్నారు.
అమెరికా నుంచి కాకుండా ఇతర దేశాలు, అలాగే ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది హైదరాబాద్ కు వస్తున్నారు. రాష్ట్రంలో సంతాన లేమి సమస్య రోజురోజుకూ పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది థైరాయిండ్, ఒబెసిటీ వల్ల సంతానం కలగడం లేదనిచెబుతున్నారు. కొంత మంది మహిళలు ధూమపానం చేస్తున్నారు. వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పురుషుల్లో మద్యం తాగాం, సిగిరేట్లు తాగడం, ఒత్తిడితో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందని వివరిస్తున్నారు. చక్కటి జీవన శైలి ఉంటేనే పిల్లలు త్వరగా పుడతారని చెబుతున్నారు.
More Articles
- ఇరాన్‌కు లాస్ట్ ఛాన్స్.. భీకర దాడులకు ట్రంప్ బిగ్ స్కెచ్.. నీ పిల్ల బెదిరింపులకు భయపడాలా అంటూ ఇరాన్ కౌంటర్..
- ట్రంప్ కొత్త టారిఫ్ ప్రకటన.. ఫార్మా రంగానికి బిగ్ షాక్.. భారత ఫార్మా కంపెనీలపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
- Dinosaur skeleton: రూ.482 కోట్లు పలికిన డైనోసార్ అస్థిపంజరం..
- ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు.. హార్ముజ్ తర్వాత సౌదీ షిప్పింగ్‌కు పెను ముప్పు..
- Crude Oil: 90 డాలర్లకు చేరిన క్రూడ్ ఆయిల్.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా..!
- అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు.. జీరో అవర్ హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..