ఒక కంపెనీ విజయం వెనక యజమానులు, టాప్ మేనేజ్మెంట్ తో పాటు ఉద్యోగులు, ఆ సంస్థల పని చేసిన ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఈసాప్ ఇస్తుంటాయి. అయితే చాలా వరకు కంపెనీలు టాప్ మేనేజ్మెంట్ కు మరి అయితే ఉద్యోగులకు ఈసాప్స్ ఇస్తుంటాయి. కానీ ఇన్ఫోసిస్ మాత్రం తమ సంస్థ పని చేసిన డ్రైవర్లు, ఎలక్ట్రిషిన్లు, సహాయ సిబ్బంది కూడా కంపెనీ ఈసాప్స్ ఇచ్చింది. ఈసాప్ షేర్లతో చాలా మంది కోటీశ్వరులుగా మారారు.
ఇన్ఫోసిస్ డ్రైవర్లు, ఎలక్ట్రిషియన్లు, సహాయ సిబ్బందిని ధనవంతులుగా చేసింది.
ఇన్ఫోసిస్ ఐపీఓ 1993లో వచ్చింది. 1994లో ఇన్ఫోసిస్ భారతీయ కార్పొరేట్ చరిత్రలో మొదటిసారిగా తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల కోసం ఎంప్లాయీ షేర్ ఓనర్‌షిప్ ప్లాన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు ఈసాప్స్ కేటాయించడంలో అప్పటి ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ కీలకంగా వ్యవహరించారు. షేర్లను కేవలం పెద్ద పెద్ద ఉద్యోగులకే కాకుండా సంస్థళో పని చేసే ప్రతి చిన్న ఉద్యోగికి స్టాక్ ఆప్షన్లు ఇచ్చారు. తమ కంపెనీలో పని చేసే వారిని ధనవంతులుగా ఎదగడానికి అవకాశం కల్పించింది.
కాగా ఇన్ఫోసిస్ 1999లో మార్చిలో వరల్డ్ లోనే రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నాస్ డాక్ లో లిస్ట్ అయింది. అంతే కాదు నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ కంపెనీ పనితీరు బాగుండడంతో షేర్ ప్రైస్ కూడా భారీగా పెరిగింది. ఐపీఓ టైమ్ రూ.95 ఉన్న స్టాకా ప్రైస్ 6 సంవత్సరాల్లో రూ.8,100 కు చేరింది. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, సహాయ సిబ్బంది తమ షేర్లను విక్రయించారు.
ఇన్ఫోసిస్ అందించిన ఈసాప్‌లు కలిగి ఉన్న దాదాపు 1,800 మంది ఉద్యోగులు కోటీశ్వరులుగా మారా. ఇక్కడ ఉద్యోగులే కాకుండా, షేర్లు కలిగిన డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు , ఇతర సహాయక సిబ్బంది కూడా ఈ సంపద సృష్టి ద్వారా ధనవంతులు అయ్యారు. నెలవారీ జీతాలకంటే దీర్ఘకాలికంగా కంపెనీ షేర్లను కలిగి ఉండటం ద్వారా చాలా సంపదను సృష్టించుకున్నారు. రూ.10 వేల ప్రారంభ మూలధనంతో మొదలై, లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన ఇన్ఫోసిస్ ప్రయాణంలో అ కంపెనీ తీసుకున్న నిర్ణయం చాలా కుటుంబాలను కోటీశ్వరులుగా మార్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Below Rs.100 Stocks: రూ.100 లోపు క్వాలిటీ స్టాక్స్ కోసం చూస్తున్నారా..!
- Multibagger Stock: ఆరు నెలల్లోనే 206 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్..
- స్టాక్ మార్కెట్ మండే ఎలా ఉండబోతోంది.. ఆ ఒక్కటి జరిగితే ఇన్వెస్టర్ల డబ్బు వచ్చే వారం కూడా ఆవిరే..
- Stock Market: మార్కెట్ క్రాష్.. రూ.లక్షల కోట్లు నష్టపోతున్న పెట్టుబడిదారులు..!
- Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ షేర్లు..!
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల కొంపలు ముంచిన ట్రంప్.. ఈ రంగాలకు భారీ నష్టాలు..