భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రెంచ్ కార్మిక అధికారులు భారీ షాకిచ్చారు. సమయ నమోదు (Time-recording) వ్యవస్థ ఫ్రెంచ్ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో సుమారు రూ. 2 కోట్ల (175,000 యూరోలు) జరిమానా విధించారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రాంతీయ కార్మిక సంస్థ DRIEETS Ile-de-France ఈ చర్యలు చేపట్టింది. ఈ జరిమానా వసూలుకు సంబంధించిన సమాచారం అందిందని.. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడిస్తున్నామని ఇన్ఫోసిస్ తాజా ప్రకటనలో తెలిపింది.
రెగ్యులేటర్ జరిపిన పరిశోధనల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైమ్-ట్రాకింగ్ వ్యవస్థ విశ్వసనీయత, ఆడిట్ చేయదగిన రికార్డులను నిర్వహించగల సామర్థ్యం, కొంతమంది ఉద్యోగులను పర్యవేక్షించే తీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫ్రెంచ్ కార్మిక నిబంధనల ప్రకారం.. యజమానులు చట్టబద్ధమైన 35-గంటల పనివారం, ఓవర్‌టైమ్, తప్పనిసరి విశ్రాంతి సమయాలను కచ్చితంగా నమోదు చేయాలి. ఈ రికార్డులు ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీకి (ఆడిట్‌కు) వీలుగా ఉండాలి. అయితే ఈ లోపాల వల్ల ఏయే వర్గాల ఉద్యోగులు ప్రభావితమయ్యారు లేదా ఈ వ్యవస్థలో ఎలాంటి నిర్దిష్ట మార్పులు చేయాలని కోరారనేది కంపెనీ ఫైలింగ్‌లో స్పష్టం చేయలేదు.
ఈ జరిమానాపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. దీని ప్రభావం తమ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై పెద్దగా ఉండదని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని సమీక్షిస్తున్నామని, తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఒకవైపు భారతదేశంలోని కార్యాలయాల నుండి ఉద్యోగులను అదనపు సమయం పనిచేయాలని కోరుతున్న తరుణంలోనే.. ఐరోపాలో ఇన్ఫోసిస్‌కు ఈ అనుభవ ఎదురవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ఇన్ఫోసిస్‌కు కొత్త బాస్.. సలిల్ పరేఖ్ రాజీనామా.. కొత్త CEOగా ఆశిష్ కుమార్ దాస్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే ..
ఇటీవలే ఇన్ఫోసిస్ తన వర్క్-ఫ్రమ్-ఆఫీస్ నిబంధనలను కఠినతరం చేసింది. మొదట 7వ స్థాయి (JL7), అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులను వారానికి నాలుగు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించిన కంపెనీ.. మార్చి నెలలో ఈ విధానాన్ని 6A (JL6+) శ్రేణికి కూడా విస్తరించింది. అంతర్గత ఇమెయిల్స్ ప్రకారం.. ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్ హాజరును పూర్తి చేయడంలో విఫలమవడమే ఈ కఠిన నిబంధనలకు కారణమని తెలుస్తోంది. అయితే టీం కృషి, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని.. తమది ఇప్పటికీ 'హైబ్రిడ్ మోడల్' అని కంపెనీ సమర్థించుకుంటోంది.
మరోవైపు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల పని గంటలపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతోంది. చైనాలోని '9-9-6' (వారానికి 6 రోజులు, ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు, అంటే 72 గంటలు) పని సంస్కృతిని ఉదహరిస్తూ.. కష్టపడకుండా ఏ దేశమూ ముందుకు వెళ్లలేదని, భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ, ప్రస్తుతం ఫ్రెంచ్ అధికారులు విధించిన జరిమానా ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేశారనే దానికంటే.. కంపెనీ ఆ పని గంటలను చట్టబద్ధంగా, కచ్చితంగా నమోదు చేయడంలో విఫలమైందనే కోణంలోనే రావడం గమనార్హంగా చూడవచ్చు.
More Articles
- Infosys: తమ సంస్థలో పని చేసిన డ్రైవర్లు, సహాయ సిబ్బందిని కోటీశ్వరులను చేసిన ఇన్ఫోసిస్..!
- Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ షేర్లు..!
- ఇన్ఫోసిస్‌కు కొత్త బాస్.. సలిల్ పరేఖ్ రాజీనామా.. కొత్త CEOగా ఆశిష్ కుమార్ దాస్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే ..
- ఐటీ షేర్లు: ఒక్కసారిగా లాభాల జోరు! అసలు రహస్యం ఇదేనా?
- TCS: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టీసీఎస్ స్టాక్.. మిగతా ఐటీ స్టాక్స్ కూడా..!
- Narayana Murthy: రెండు కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన నారాయణ మూర్తి క్యాటమరన్ వెంచర్స్..