దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అందరు భావించారు. అయితే అనూహ్యంగా ద్రవ్యోల్బణం పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఆహార ద్రవ్యోల్బణం జూన్ లో 5.32 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.78 శాతంగా ఉంది. జూన్ లో రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 4.38 శాతంగా ఉంది. ఇది మే నెలలోని 3.93 శాతంగా ఉంది. గత 6 నెలల్లో ఇదే అత్యధిక స్థాయి. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం లక్ష్యాన్ని కూడా ద్రవ్యోల్బణం దాటేసింది. ప్రధానంగా ఆహార ధరలు, రవాణా ఖర్చులు పెరగడమే ఈ పెరుగుదలకు కీలక కారణంగా ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.
ఈసారి ఆహారం ధరలే ద్రవ్యోల్బణాన్ని ఎక్కువగా ప్రభావితం చేశాయి. మేలో 4.78 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లో 5.32 శాతానికి పెరిగింది. వినియోగదారుల ధరల సూచీలో ఆహార పదార్థాల వాటా దాదాపు సగం ఉండటంతో, వాటి ధరల్లో పెరుగుదల నేరుగా మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ అండ్ బెవరేజెస్ ధరలు 6.94 శాతం పెరగడంతో ఆహారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే పర్సనల్ వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు 7.35 శాతం, సరుకు రవాణా సేవల ఖర్చులు 7.70 శాతం పెరిగాయి.
వాహనాల కొనుగోలు విభాగంలో ద్రవ్యోల్బణం -4.59 శాతంగా నమోదు అయింది. వినోదానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులు, గృహోపకరణాల ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.74 శాతానికి పెరగ్గా.. పట్టణాల్లో అది 3.92 శాతంగా ఉంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రజలపై ఆహార ధరల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. గత 5 నెలలుగా తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం జూన్‌లో మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మే నెలతో పోలిస్తే గత నెలలో వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) 1.7% పెరిగింది.
చమురు ధరలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి తగ్గినందున, ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం తగ్గింది. అయినప్పటికీ అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. బలహీనమైన రుతుపవనాలు, ఎల్ నినో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పంట దిగుబడులు తగ్గి ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పెరిగిన ఎరువుల ధరలు ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. కాగా.. జూన్ 5న, ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి), పాలసీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది.
More Articles
- ద్రవ్యోల్బణం తగ్గింది.. మీ జేబుకు ఊరట! ఈఎంఐలు, ఎఫ్డీలపై ఆర్బీఐ ఏం చేయబోతోంది?
- గుడ్ న్యూస్! తగ్గిపోతున్న ధరలు! RBI వడ్డీ రేట్లను తగ్గించబోతోందా? EMIలు తగ్గే ఛాన్స్!
- సామాన్యులకు శుభవార్త! పడిపోతున్న ఇన్ఫ్లేషన్.. మీ EMI లు మరింత తగ్గుతాయా?
- Retail Inflation: జులైలో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Retail Inflation: జూలైలో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. ఐదేళ్ల కనిష్ఠానికి..
- Retail Inflation: షాకింగ్ 5 శాతం దాటేసిన రిటైల్ ద్రవ్యోల్బణం.. కారణాలివే?