స్మాల్ క్యాంప్ కంపెనీ అయిన ఇండో ఎస్ఎంసీ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీలో ప్రముఖ పెట్టుబడిదారుడు ఆశిష్ కచోలియా తన వాటాను పెంచుకున్నారు. ఆశిష్ కచోలియా ఇండో ఎస్‌ఎమ్‌సీలో తన వాటాను 2.46 శాతం నుంచి 3.03 శాతానికి పెంచారు. ఈ కంపెనీ ఆరు నెలల్లోనే 206 శాతం రాబడిని ఇచ్చింది. గత బుధవారం ఈ కంపెనీకి ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ నుంచి రూ.66 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ (VFD) ప్యానెళ్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ మొత్తం 2026 జూలై 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.

Advertisement

కస్టమర్ వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, మహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ నుంచి ఈ ఆర్డర్ వచ్చినట్లు తెలిపింది. ఈ క్లయింట్ విద్యుత్, చక్కెర, సిమెంట్, మౌలిక సదుపాయాలు, రైల్వేల వంటి కీలక రంగాలకు అవసరమైన భారీ ఫ్యాబ్రికేషన్ పనులను నిర్వహిస్తుంటారని సమాచారం. కాగా ఇండో ఎస్ఎంసీ కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయి. గత సంవత్సరంతో పోలిస్తే రాబడి ఏకంగా 136 శాతం పెరిగి రూ. 88.12 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. పవర్ డిస్ట్రిబ్యూషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రిఫికేషన్ రంగాల్లో వస్తున్న భారీ పెట్టుబడులు ఈ కంపెనీకి కలిసొస్తున్నాయి.

Advertisement

గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో నాలుగు తయారీ కేంద్రాలతో పాటు సొంత ఆర్‌అండ్‌డీ విభాగాలు ఉండడం వల్ల కంపెనీ వేగంగా ముందుకెళ్తోంది. ఈ కంపెనీలో మూడు ప్రధాన వ్యాపార విభాగాలు ఉన్నాయి. షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ విభాగం - ఇది ఎనర్జీ మీటర్ ఎన్‌క్లోజర్ బాక్సులు, SMC షీట్లు, చెకర్డ్ ప్లేట్లను తయారు చేస్తుంది. ఎఫ్ఆర్పీ విభాగం - ఇది వివిధ పారిశ్రామిక అవసరాల కోసం గ్రేటింగ్ ప్లేట్లు, పుల్ట్రూడెడ్ ఉత్పత్తులు, స్టోరేజ్ ట్యాంకులను ఉత్పత్తి చేస్తుంది.ఎలక్ట్రికల్ కాంపోనెంట్ విభాగం - ఇది హెచ్టీసీటీ, హెచ్టీపీటీ, ఎల్టీసీటీ, ఎల్టీ/హెచ్టీ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, ఫీడర్ పిల్లర్లు, స్విచ్‌గేర్‌లను తయారు చేస్తుంది.

Advertisement

2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.15 కోట్ల లాభంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.ఈ స్టాక్
గత మూడు నెలల్లోనూ ఈ స్టాక్ లాభంతో ముగిసింది. తద్వారా ఈ కాలంలో మొత్తం 174% వృద్ధిని నమోదు చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.