ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన 20వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 20,000 ఉచిత దేశీయ టిక్కెట్లను అందించే ఒక కస్టమర్ ప్రమోషన్‌ను ప్రారంభించింది. "ఇండిగోఫ్రీ" ప్రచారం ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 మధ్య నిర్వహిస్తున్నారు. ఇండిగో వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ 6Eskai ద్వారా దేశీయ బుకింగ్‌లు చేసుకోవచ్చు. వీటి ద్వారా బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద ప్రమోషనల్ కాలంలో చేసిన బుకింగ్‌ల నుంచి అర్హులైన కస్టమర్‌లను ర్యాండంగా ఎంపిక చేసి, ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వమని ఈమెయిల్, వాట్సాప్ ద్వారా ఆహ్వానిస్తారు.
మూడు ప్రయత్నాలలోపు సరిగ్గా సమాధానం ఇచ్చిన ప్రయాణికులకు, ప్రతి ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR)కు గరిష్టంగా రూ. 10,000కు లోబడి, వారి బుకింగ్ మొత్తాన్ని వాపసు (రీఫండ్) చేస్తారని విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ దేశీయ ఎకానమీ క్లాస్‌తో పాటు, వన్-వే, రిటర్న్ ప్రయాణాల కోసం చేసే 'ఇండిగోస్ట్రెచ్' బుకింగ్‌లకు కూడా వర్తిస్తుందని విమానయాన సంస్థ పేర్కొంది. ఇండిగో ప్రకారం, భారతదేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విమానయాన సంస్థ ప్రస్తుతం 430కి పైగా విమానాలను నిర్వహిస్తోంది.
95కు పైగా దేశీయ, 40 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతూ ప్రతిరోజూ దాదాపు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది. FY26లో ఇండిగో 123 మిలియన్లకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. కాగా..భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ, వ్యూహాత్మక మరియు ఆర్థికేతర సహకారం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించేందుకు 'ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్' (ఇండిగో)తో న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- ఢిల్లీ, ముంబై రేంజ్లో వరంగల్ ఎయిర్పోర్ట్.. సెల్ఫ్ చెక్-ఇన్, స్మార్ట్ ఫీచర్లతో మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
- Bengaluru: డీకే శివకుమార్ హింట్ ఇచ్చేశారు.. బెంగళూరు సెకండ్ ఎయిర్పోర్ట్ డెస్టినేషన్ ఇదే!
- Bengaluru: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ.. మనుషులకు పనిలేకుండానే విమానాల కంట్రోల్!
- అమెరికా ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం.. వందలాది విమానాల రద్దు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది..
- రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..
- గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులు.. ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు..