అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం.. దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో నేరుగా జోక్యం చేసుకుంటుందనే అంచనాలు బలపడటంతో భారత రూపాయి మంగళవారం పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గత రెండు వారాలలోనే అత్యంత గరిష్ట స్థాయికి చేరింది.
వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయని.. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర 1 శాతం తగ్గి బ్యారెల్‌కు 87.3డాలర్లకి పడిపోయింది. దాదాపు ఐదు నెలలుగా సాగుతున్న ఈ యుద్ధ వాతావరణం భారతదేశం వంటి ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాల సరఫరా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది.
అయితే ఉద్రిక్తతలు తగ్గడం రూపాయికి కలిసివచ్చింది. గత వారం గణనీయంగా క్షీణించిన రూపాయి.. ఆ తర్వాత నుండి 1 శాతం కోలుకుని, గత సెషన్ ముగింపు 95.91తో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే 95.70 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌బీఐ తరఫున కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రూపాయి ఇప్పటివరకు 6.5 శాతం క్షీణించడంతో.. కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు కేంద్ర బ్యాంకు విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో తన జోక్యాన్ని పెంచింది.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల వ్యయంపై భయాల వల్ల ఆసియా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఆసియా స్టాక్‌ల MSCI సూచీ ఏకంగా 3 శాతం పడిపోయింది. అయితే, గ్లోబల్ చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో ప్రత్యక్ష సంబంధం తక్కువగా ఉండటం వల్ల భారతీయ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా ప్రభావితం కాకుండా దాదాపు స్థిరంగా ముగిశాయి.
రూ. 10, రూ. 20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పేపర్ నోట్లు రద్దుపై కీలక ప్రకటన..
ప్రస్తుతం ఇన్వెస్టర్లందరి దృష్టి బుధవారం నాటి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ఫెడ్ ఛైర్ కెవిన్ వార్ష్ చేసే ప్రకటనలపైనే కేంద్రీకృతమై ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం 40 శాతం వరకు ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. అయితే ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని అంచనా వేసిన గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషకులు.. రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు సంభావ్యతను గతంలో ఉన్న 25 శాతం నుండి 35 శాతానికి సవరించడం గమనార్హం.
ఆర్బీఐ ప్రవేశపెట్టిన ప్రత్యేక విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (FCNR-B) డిపాజిట్ పథకం, విదేశీ వాణిజ్య రుణాలు (ECB) స్వ్యాప్ విండో ద్వారా భారత బ్యాంకులు జూలై మధ్య నాటికి సుమారు 20.7 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సమీకరించాయి. ఈ మూలధన ప్రవాహం రూపాయి 96.50 - 97.00 స్థాయి దాటి మరింత దిగజారకుండా రక్షణగా నిలిచింది.
రికార్డు స్థాయి కనిష్టమైన 96.96 స్థాయిని తాకకుండా నిరోధించడానికి ఆర్బీఐ 96.55 - 96.60 పరిధిలో డాలర్లను విక్రయిస్తూ నిరంతరం మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. చారిత్రాత్మకంగా గడిచిన 18 ఏళ్లలో 13 సార్లు ఆగస్టు నెలలో రూపాయి బలహీనపడటం నమోదైంది. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, చమురు ధరలలో వ్యత్యాసాల వల్ల రాబోయే వారాల్లో రూపాయిపై మళ్లీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విదేశీ మారకద్రవ్య (Forex) విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
More Articles
- పెరుగుతున్న ముడి చమురు ధరలతో రూపాయి భారీ పతనం.. తొలిసారిగా 96 మార్కును దాటి కనిష్ట స్థాయికి..
- 6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..
- చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..
- USD to INR: డాలర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? డాలర్ ఆధిపత్యం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Gold: డాలర్ స్థానాన్ని గోల్డ్ రీప్లేస్ చేస్తుందా? ఫ్యూచర్లో ఏం జరగబోతోంది?
- బంగారం దెబ్బకు డాలర్ విలవిల.. కుప్పకూలిన విలువ.. ట్రేడ్ వద్దంటున్న బ్రిక్స్ దేశాలు..