మ్యూచువల్ ఫండ్ల కొత్త కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. కొన్ని కంపెనీల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటాయి. కొన్ని కంపెనీల్లో వాటాలను పెంచుకుంటాయి. ఇది ప్రతి నెల జరిగే ప్రక్రియ. అయితే 2026 జూన్ లో ఒకే కంపెనీలో 40 మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి పెట్టాయి. జేఎస్ డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్ ను కంపెనీలు తన పోర్ట్ ఫోలియోలో యాడ్ చేసుకున్నాయి. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్లలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ప్లెక్సీ క్యాప్ ఫండ్లు ఉన్నాయి.

Advertisement

నెల రోజుల వ్యవధిలో మ్యూచువల్ ఫండ్లు ఒకే స్టాక్‌ను ఎంచుకున్నాయి. దీనిని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, నలభై పరిశోధనా బృందాలు స్వతంత్రంగా ఒకే నిర్ధారణకు వచ్చాయని తెలుస్తోంది. ప్రతి నెలా, ఏఎంసీలు తమ హోల్డింగ్స్‌ను ప్రచురిస్తాయి. ప్రతి నెలా ఆర్థిక పత్రికలు ఆ ప్రకటనలను జాబితాలును ప్రకటిస్తాయి. కొనుగోలు చేసిన స్టాక్‌లు, అమ్మిన స్టాక్‌లు, పూర్తిగా నిష్క్రమించిన స్టాక్‌ల వివరాలు వెల్లడిస్తాయి. అవి ఒక ఫండ్ ఇప్పుడు ఎన్ని స్టాక్స్ తమ పోర్ట్ ఫోలియోలో ఉన్నాయో చెబుతుంది.

Advertisement

ఫండ్లు రెండు విధాలుగా కంపెనీల్లో వాటాను కొనుగోలు చేస్తాయి. బహిరంగ మార్కెట్‌లో షేర్లను కొనుగోలు చేసి కంపెనీలో వాటా తీసుకుంటుంది. లేదా ఐపీఓ యాంకర్ బుక్, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ఆఫర్ ఫర్ సేల్ వాటాను కొనుగోలు చేస్తాయి. జూన్‌లో మ్యూచువల్ ఫండ్స్ చేసిన ఈక్విటీ కొనుగోళ్లలో ఎక్కువగా బ్లాక్ డీల్స్, క్యూఐపీలు, ఆఫర్-ఫర్-సేల్ లావాదేవీలు ఉన్నాయి. అత్యధికంగా కొనుగోలు చేసిన పది స్టాక్‌లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్, ఎన్‌హెచ్‌పీసీతో పాటు మరికొన్ని ఉన్నాయి.

జూన్ లో మ్యూచువల్ ఫండ్‌లు ఆక్మే సోలార్ హోల్డింగ్స్‌లో 7.20 శాతం, క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్‌లో 5.12 శాతం, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 4.95 శాతం, పైన్ ల్యాబ్స్‌లో 4.71 శాతం వాటాను కొనుగోలు చేశాయి. కాగా సెబీ ఐపీఓలో మొత్తం యాంకర్ ఇన్వెస్టర్ రిజర్వేషన్‌ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్‌కు 33 శాతం, బీమా సంస్థలకు, పెన్షన్ ఫండ్స్‌కు 7 శాతం కేటాయించారు. ఒకవేళ బీమా, పెన్షన్ ఫండ్స్ వాటాకు స్పందన రాకపోతే, దానిని మ్యూచువల్ ఫండ్స్‌కు తిరిగి కేటాయిస్తారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.