ప్రపంచ కంపెనీల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఆ కంపెనీలకు సీఈఓలుగా పని చేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదేళ్ల, వాట్సాప్ సీఈఓగా కునాల్ షా చేస్తున్నారు. ఇందులో సత్య నాదేళ్ల మన తెలుగువాడే, ఇప్పుడు మరో తెలుగు వ్యక్తి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ అయ్యాడు. అతనే ఉదయ్‌ రుద్దర్రాజు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (AI) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐ కంప్యూట్‌ విభాగ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఉదయ్‌ రుద్దర్రాజు నియామకం అయ్యాడు. ఉదయ్ ఓపెన్ ఏఐలో సీనియర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీడర్‌గా చేరాడు.

Advertisement

అతని ప్రతిభను గుర్తించిన కంపెనీ సీటీఓగా ప్రమోషన్ ఇచ్చింది. ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మ స్క్ కు చెందిన ఎక్స్ ఏఐ నుంచి ఉదయ్ గత సంవత్సరం బయటకు వచ్చారు. ఆ తర్వాత ఓపెన్ ఏఐలో చేరాడు. కంపెనీలో జాయిన్ ఏడాదిలోనే ఆయన సీటీఓగా పదోన్నతి పొందారు. ఇందుకు సంబంధించి ఉదయ్ రుద్దర్రాజ్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. వరల్డ్ లోనే అతిపెద్ద ఫుట్ ప్రింట్ నిర్మించాలనేది తమ లక్ష్యమని ఉదయ్ పేర్కొన్నాడు. ఓపెన్ఏఐ తన సంవత్సరం పని అద్భుతమైన సంతృప్తిని ఇచ్చిందని తెలిపాడు. ఓపెన్ఏఐ తన ఏఐ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించడంపై దృష్టి పెట్టిందని చెప్పారు.

Advertisement

"మాకు చాలా ఉత్తేజకరమైన కంప్యూట్ ర్యాంప్, రోడ్‌మ్యాప్ రాబోతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన పెద్ద-స్థాయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, హార్డ్‌వేర్, తయారీ, డేటా సెంటర్ నిర్మాణాలలో ఇంకా చాలా చేయాల్సి ఉంది" అని ఉదయ్ రుద్దర్రాజ్ పేర్కొన్నాడు. కాగా ఓపెన్ఏఐకి చెందిన చాట్ జీపీటీని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. కాగా. ఈ ఓపెన్ ఏఐకి మోక్రోసాఫ్ట్ మద్దతు ఉంది. ఉదయ్ ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ హెడ్‌గా చేరడానికి ముందు ఈబై, రాబిన్‌హుడ్‌లలో పని చేశారు. ఉదయ్ రుద్దరరాజు 2025లో ఓపెన్ఏఐలో చేరారు. ఎక్స్ఏఐకి పంపిన తన వీడ్కోలు సందేశంలో, కంపెనీ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలో సహాయపడే అవకాశం ఇచ్చినందుకు అతను మస్క్‌కు, వారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

హైదరాబాద్ కు చందిన ఉదయ్ రుద్దర్రాజు ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ఇంటర్న్‌షిప్‌ చేశాడు. బిటెక్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లాడు. అక్కడ మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చదివాడు. 2012లో ఇబేలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ 2018 వరకు పని చేశారు. ఆ తర్వాత రాబిన్ హుడ్ లో చేరాడు. అక్కడ 2024 వరకు పన చేశారు. ఈ మధ్యలోనే ఎక్స్ఏఐలో సంవత్సర కాలం పని చేసి 2025 జులైలో ఓపెన్‌ఏఐలో జాయిన్ అయ్యారు.