మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. అయితే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సిప్ రూపంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గడిచిన 10 ఏళ్ల మంచి రాబడి అందించిన మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఈ ఫండ్లలో 20 శాతానికి పైగా రాబడి వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఏడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గత 10 ఏళ్లలో మంచి రాబడి ఇచ్చాయి. గత పది సంవత్సరాల్లో 20 శాతానికి పైగా రాబడి ఇచ్చిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లను పరిశీలిద్దాం...
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత 10 ఏళ్లలో దాదాపు 22.21 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. రూ.10 వేలు నెల నెలా పొదుపు చేసినట్లయితే ఈ ఫండ్ ఇప్పుడు వాల్యూ రూ.38.80 లక్షలకు చేరేది. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ పదేళ్లో 21.97 శాతం వార్షిక అందించింది. సిప్ ద్వారా రూ.10 వేల పొదుపుతో రూ.38.30 లక్షలు అందించింది.
ఎడల్వేయిస్ మిడ్ క్యాప్ ఫండ్ గత 10 సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 21.52 శాతం మేర అందించింది. రూ.10 వేల సిప్ తో రూ.37.40 లక్షలు అందించింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ పదేళ్లలో 20.95 శాతం సిప్ రాబడి అందించింది. రూ.10 వేల సిప్ పెట్టుబడిని 10 ఏళ్లలోనే రూ.36.20 లక్షలు చేసింది. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ గత పది సంవత్సరాల కాలంలో సగటున 20.66 శాతం చొప్పున వార్షిక రాబడి అందించింది. రూ.10 వేల సిప్ తో రూ.35.70 లక్షలు అందించింది.
యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ గత పదేళ్లలో సగటున వార్షిక రాబడి 20.28 శాతం అందించింది. రూ.10 వేల పొదుపుతో రూ.35 లక్షల వరకు అందించింది.
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ గత పది సంతవ్సరాల కాలంలో 20.21 శాతం వార్షిక రాబడి ఇచ్చింది. రూ.10 వేల సిప్ పొదుపుతో రూ.34 లక్షలకు పైగా అందించింది.
గత 10 సంవత్సరాల్లో ఫండ్ ఇచ్చిన రిటర్నులు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఇస్తాయని చెప్పలేము.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Mutual Funds: 20 ఏళ్లలో అదిరిపోయే రాబడులు ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
- Mutual Funds: మిడ్, ప్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలోకి పెరిగిన పెట్టుబడులు..
- Mutual Fund: రూ.లక్షను రూ.2.8 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ ఇదే..!
- 3 ఏళ్లలో 37% CAGR రిటర్న్స్ ఇచ్చిన టాప్ SIP ఫండ్స్ ఇవే!
- Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెరిగిన పెట్టుబడులు..
- Mutual Fund: మ్యూచువల్ ఫండ్ లో సిప్ పెట్టుబడి పెడుతున్నారా..!