ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. దేశీయంగా ఉండే భారీ డిమాండ్‌లో గణనీయమైన భాగాన్ని.. విదేశాల నుండి దిగుమతి చేసుకునే Gold ద్వారానే తీర్చుకుంటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం విధించే అధిక దిగుమతి సుంకాలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, దేశీయ మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసాన్ని సృష్టిస్తున్నాయి.

Advertisement

ఈ ధరల వ్యత్యాసమే అక్రమ రవాణాదారులకు అద్భుతమైన లాభదాయక అవకాశంగా మారుతోందని మనీకంట్రోల్ ఇటీవల విడుదల చేసిన తన ప్రత్యేక నివేదికలో విశ్లేషించింది. ముఖ్యంగా దుబాయ్ వంటి ప్రధాన బులియన్ కేంద్రాల నుండి భారతీయ కొనుగోలుదారులు, వ్యవస్థీకృత సిండికేట్లు అక్రమ మార్గాల్లో బంగారాన్ని రవాణా చేసే ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నారు.

Advertisement

దిగుమతి సుంకాల శాతానికి, స్మగ్లింగ్ ద్వారా లభించే లాభాలకు నేరుగా సంబంధం ఉందని చెప్పవచ్చు. గతంలో బంగారంపై దిగుమతి సుంకం 6 శాతం, జీఎస్‌టీ 3 శాతంగా ఉన్న సమయంలో.. రవాణా ఖర్చులు, డిస్కౌంట్లు పోగా స్మగ్లర్లకు సుమారు 3 శాతం మేర లాభం దక్కేది. అయితే, ప్రస్తుత విధానాల ప్రకారం దిగుమతి సుంకం 15 శాతానికి, జీఎస్‌టీ 3 శాతానికి చేరడంతో.. ఈ అక్రమ మార్జిన్ లాభం ఏకంగా 6 నుండి 8 శాతానికి పెరిగింది. దిగుమతి సుంకాలు ఎంత ఎక్కువగా ఉంటే.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకున్న బంగారానికి, అంతర్జాతీయ మార్కెట్‌లో దొరికే రకానికి మధ్య వ్యత్యాసం అంత పెరుగుతుంది. దీంతో అక్రమ మార్కెట్ అధికారిక ధర కంటే తక్కువ ధరకే దేశీయంగా పసిడిని సరఫరా చేస్తూ భారీగా లాభార్జన చేస్తోంది.

Advertisement
బస్సు డ్రైవర్ కాదు అవినీతి కొండ.. 15 కేజీల బంగారం, రూ. 29 కోట్ల నగదు వెలికితీత..

ఏవియేషన్ కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) వంటి దర్యాప్తు ఏజెన్సీలు తమ నిఘాను తీవ్రతరం చేయడంతో.. తనిఖీల నుండి తప్పించుకోవడానికి స్మగ్లర్లు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. సాధారణ వస్తువుల రూపంలో బంగారాన్ని మభ్యపెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. బెల్ట్ బకిల్స్, షర్టు బటన్లు, విగ్గుల కింద దాచే గోల్డ్ పేస్ట్, దుస్తులలో నేరుగా కుట్టే సన్నటి గొలుసుల రూపంలో పసిడిని దాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బంగారాన్ని చిన్న రేణువులుగా కరిగించి, ఇతర లోహాల రంగుల పూత పూసి సాధారణ పరికరాలుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో జూలై 1న డీఆర్ఐ దేశవ్యాప్తంగా జరిపిన మెరుపు దాడుల్లో 9 కిలోల అక్రమ బంగారంతో పాటు.. ఢిల్లీలోని ఒక అక్రమ Gold మెల్టింగ్ యూనిట్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.

Advertisement

ఇలా స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశించే బంగారం కేవలం నల్లబజారుకే పరిమితం కాకుండా.. అత్యంత చకచక్యంగా ప్రధాన బులియన్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. అక్రమ బంగారాన్ని పాత ఆభరణాలు, రిఫైనరీ స్క్రాప్ లేదా వారసత్వంగా వచ్చిన పసిడి రూపంలో మభ్యపెట్టి కరిగిస్తున్నారు. అనంతరం దీనిని చట్టబద్ధమైన బులియన్‌తో కలిపి వేసి.. నకిలీ బిల్లులు, బ్యాంకింగ్ మార్గాల ద్వారా విక్రయిస్తూ సాధారణ వ్యాపారంగా మారుస్తున్నారు. అధికారిక మార్కెట్ లాగా కాకుండా.. ఈ అక్రమ మార్కెట్‌లో లభించే బంగారానికి స్థిరమైన ధర ఉండదు.. ఆ సమయంలో మార్కెట్‌లో ఉన్న అధికారిక ధరపై ఇచ్చే డిస్కౌంట్ ఆధారంగానే దీని విక్రయాలు సాగుతున్నాయి.