పసిడి, వెండి ధరలు ఈ మధ్య కాలంలో అనేక ఒడిదుడుకులకు లోనవుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో విలువైన లోహాల మార్కెట్‌లో పెట్టుబడిదారులు అత్యంత నిశితంగా గమనించే సూచికలలో ఒకటైన Gold -వెండి నిష్పత్తి.. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు తీవ్ర అస్థిరతకు గురైంది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ ఆందోళనలు, వివిధ కేంద్ర బ్యాంకుల అంచనాలు, పెట్టుబడిదారుల Gold, వెండి పై ఆచితూచి స్పందించడమే ఇందుకు ప్రధాన కారణంగా చూడవచ్చు. మే నెలలో ఈ నిష్పత్తి కొంత మేర పడిపోయినప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుని మంగళవారం నాటికి 69 కి చేరుకుంది. ఈ స్థాయికి చేరుకోవడం ద్వారా అది తన దీర్ఘకాలిక చారిత్రక సగటుకు దగ్గరగా వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.
అసలు బంగారం-వెండి నిష్పత్తి అనేది ఒక ఔన్సు బంగారం కొనడానికి ఎన్ని ఔన్సుల వెండి అవసరమవుతుందనే పరిమాణాన్ని కొలుస్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ నిష్పత్తి పెరగడం అనేది వెండి కంటే బంగారం ధరలు ఎక్కువగా రాణిస్తున్నాయని సూచిస్తుంది. అదే సమయంలో ఈ నిష్పత్తి తగ్గితే మాత్రం బంగారంతో పోలిస్తే వెండి బలం పుంజుకుంటోందని అర్థం చేసుకోవచ్చు.
పెట్టుబడిదారులు చాలా కాలంగా ఈ రెండు లోహాల సాపేక్ష విలువలను అంచనా వేయడానికి.. అలాగే మార్కెట్లో ఉండే పెట్టుబడి అవకాశాలను, తమ పోర్ట్‌ఫోలియోలను పునఃసమతుల్యం చేసుకునే సమయాన్ని గుర్తించడానికి ఈ సూచికను ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగిస్తున్నారు.
టాటా మ్యూచువల్ ఫండ్ విశ్లేషణల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అంచనాలను బట్టి చూస్తే ఏ లోహం కూడా మరొకదాని కంటే గణనీయంగా ఎక్కువ విలువలో గానీ లేదా తక్కువ విలువలో గానీ ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుత 69 స్థాయి అనేది బంగారం, వెండిల మధ్య సాపేక్ష విలువలు స్థూలంగా సమతుల్యంగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
అయితే 2026 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యొక్క కఠినమైన నిర్ణయాల అంచనాల నడుమ పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో ఈ నిష్పత్తి క్లుప్తంగా 80 మార్కును కూడా దాటి పైకి పెరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా మార్కెట్ రిస్కులు క్రమంగా తగ్గడంతో ఇది తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది.
ప్రస్తుతం ఉన్న ఈ నిష్పత్తి స్థాయి ఏ విలువైన లోహానికి కూడా స్పష్టమైన అదనపు విలువ ప్రయోజనాన్ని సూచించడం లేదని ఫండ్ హౌస్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ సూచీ ఏ వైపు కదులుతుందనేది ప్రధానంగా ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల వంటి ద్రవ్య విధాన అంచనాలు, పారిశ్రామిక డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించిన ఆందోళనలు తగ్గి, పారిశ్రామికంగా డిమాండ్ మెరుగైతే.. ఈ నిష్పత్తి మరింత తగ్గి వెండి బాగా రాణించే అవకాశం ఉంది. దీనికి విరుద్ధంగా భౌగోళిక రాజకీయ, స్థూల ఆర్థిక అనిశ్చితులు ఇలాగే కొనసాగితే మాత్రం, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం తన ఆధిపత్యాన్ని మార్కెట్లో నిలుపుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Robert Kiyosaki: జీవితంలో ఫెయిల్యూర్సే గొప్ప పాఠాలు.. అపజయం లేని విజయం ఉండదన్న రాబర్ట్ కియోసాకి..!
- Gold Price In Telugu States: భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎలా ఉందంటే..!
- Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత పైకి వెళ్లిందంటే.. ఆగస్టు 11, మంగళవారం ధరలు ఇవే..
- బంగారం ఇకపై కొనలేరు.. ధర రూ.1.93 లక్షలు పై మాటే.. మోతీలాల్ ఓస్వాల్ సంచలన జోస్యం ఇదిగో..
- బంగారం, వెండి ధరలు ఈ రేటుకు వెళ్లడం ఖాయమంటున్న నిపుణులు.. పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే..