బంగారం ధరలు గత కొద్ది రోజల నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అమెరికా - ఇరాన్‌ల మధ్య సైనిక ఘర్షణలకు తాత్కాలిక విరామం లభించడం, యూఎస్ డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు ఈ వారాన్ని సానుకూల ధోరణితో ప్రారంభించాయి. అయితే ఈ వారం వెలువడనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వరకు ఈ లాభాలు పరిమితంగానే ఉండవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ అంచనా వేశారు.దీంతో Gold ధరలు కాస్త నెమ్మదిగానే కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వారాంతంలో అమెరికా-ఇరాన్ దేశాలు తదుపరి దాడులకు దూరంగా ఉండటంతో హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం గుండా సరుకు రవాణా అంతరాయాల భయాలు తగ్గాయి. అక్కడ ఉద్రిక్తతలు సడలడంతో ముడి చమురు ధరలు 5 శాతానికి పైగా పడిపోయాయి. ఇది ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించి.. వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని సడలించేందుకు కేంద్ర బ్యాంకులకు అవకాశాన్ని ఇచ్చింది. మరోవైపు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం విదేశీ కొనుగోలుదారులకు బంగారాన్ని ఆకర్షణీయంగా మార్చినప్పటికీ.. పలు దేశాల నుండి వచ్చే దిగుమతులపై కొత్త సుంకాలను విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి కొనసాగుతోంది.
ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి ఫెడరల్ రిజర్వ్ రాబోయే పాలసీ సమావేశంపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్ ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణంపై స్పష్టత కోసం ఫెడ్ ఛైర్ కెవిన్ వార్ష్ ఇచ్చే ప్రకటనలను.. త్వరలో వెలువడనున్న యూఎస్ ద్రవ్యోల్బణం, లేబర్ మార్కెట్ గణాంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. సాంకేతికంగా చూస్తే.. సుదీర్ఘ పతనం తర్వాత Gold ధరలు స్థిరపడుతూ 20-రోజుల సగటు కంటే పైకి చేరి క్రమంగా పుంజుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది నమోదైన గరిష్టాల కంటే చాలా తక్కువలోనే ట్రేడ్ అవుతుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
దుబాయ్ బంగారంపై దిమ్మదిరిగే న్యూస్.. ప్రమాదంలో భారత పసిడి సరఫరా.. స్తంభించిపోయిన యూఏఈ గోల్డ్ కోట్..
బొలింజర్ బ్యాండ్స్ విశ్లేషణ ప్రకారం.. 20-రోజుల మూవింగ్ యావరేజ్ అయిన రూ. 143,524 కంటే పైన ట్రేడ్ అవుతున్న బంగారం.. రూ. 144,000 మార్కు పైన నిలదొక్కుకుంటే రూ. 147,600 వద్ద ఉన్న ఎగువ బ్యాండ్ వైపు పయనించే అవకాశముంది. ఒకవేళ రూ. 143,500 కంటే దిగువకు పడిపోతే.. ధరలు తిరిగి రూ. 139,500 స్థాయికి జారుకోవచ్చు.
అదేవిధంగా ఫైబొనాచీ రీట్రేస్‌మెంట్ ప్రకారం.. ప్రస్తుతం బంగారం 50 శాతం (రూ. 138,000), 38.2 శాతం (రూ. 147,700) స్థాయిల మధ్య కదులుతోంది. బంగారానికి తక్షణ మద్దతు స్థాయిలు రూ. 143,500, రూ. 139,500 నుండి రూ. 138,000 వద్ద ఉండగా.. పైవైపు నిరోధక స్థాయిలు రూ. 147,600, రూ. 152,000, నుండి రూ. 159,700 వద్ద ఉన్నాయి. సమీప భవిష్యత్తులో బంగారం ధరల ట్రెండ్ తటస్థ శ్రేణిలోనే కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- దుబాయ్ బంగారంపై దిమ్మదిరిగే న్యూస్.. ప్రమాదంలో భారత పసిడి సరఫరా.. స్తంభించిపోయిన యూఏఈ గోల్డ్ కోట్..
- పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. జూలై 27, సోమవారం ధరలు ఇవే..
- Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో స్వల్ప మార్పులు..
- బంగారం ధరలు ఈ రేటును దాటకముందే కొనేయండి.. కొనుగోలుదారులకు బులియన్ నిపుణులు కీలక సూచన..
- Gold: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
- వచ్చే వారం బంగారం ధరల్లో భారీ మార్పులు.. సామాన్యులు పసిడి కొనడం వెంటనే ఆపేయాలంటున్న ఆర్థిక నిపుణులు..