బంగారం ధరలు ఈ మధ్య కాలంలో తీవ్ర ఒడి దుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతో పసిడి ధరలు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పెరిగిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (MOFSL) తమ హెచ్1 2026 విలువైన లోహాల అంచనా (H1 2026 Precious Metals Outlook) నివేదికను విడుదల చేసింది.

Advertisement

ఈ నివేదిక ప్రకారం.. Gold ధరలు తిరిగి రికార్డు స్థాయి పెరుగుదల బాట పట్టడానికి ముందు స్వల్పకాలంలో దాదాపు 8 శాతం వరకు తగ్గుదలను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. పసుపు లోహం యొక్క దీర్ఘకాలిక భవిష్యత్తుపై సంస్థ సానుకూలంగా ఉన్నప్పటికీ.. పెట్టుబడిదారులు కొత్త కొనుగోళ్లకు తొందరపడకుండా దశలవారీగా (SIP పద్ధతిలో) పెట్టుబడి పెట్టాలని సూచించింది.

Advertisement

రాబోయే 12 నుండి 15 నెలల కాలంలో Gold ధర ప్రస్తుత స్థాయిల నుంచి 6-8 శాతం మేర దిద్దుబాటుకు గురై అంతర్జాతీయ మార్కెట్‌లో 4,800 డాలర్ల కనిష్ట స్థాయిని తాకవచ్చని, ఆ తర్వాత మళ్లీ కోలుకుని 5,500 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ (USD/INR) 95.5 వద్ద స్థిరంగా ఉంటుందనే అంచనాతో.. భారతీయ పెట్టుబడిదారులకు రూ. 1,30,000 నుండి రూ. 1,33,000 శ్రేణిని ఉత్తమ కొనుగోలు జోన్‌గా MOFSL గుర్తించింది. ఆ తర్వాత బంగారం ధర మధ్యకాలికంలో రూ. 1,68,000 స్థాయికి.. దీర్ఘకాలంలో రూ. 1,93,000 మైలురాయి వైపు పయనిస్తుందని జోస్యం చెప్పింది.

Advertisement
బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఈ రోజు దెబ్బకు పసిడి రేటు ఎంత వరకు దూసుకెళ్లిందంటే.. ఆగస్టు 5, బుధవారం ధరలు ఇవే

2026 రెండవ త్రైమాసికంలో మార్కెట్ వైఖరి గణనీయంగా మారింది. ప్రారంభంలో టారిఫ్‌ల ఆందోళనలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో బంగారం బలంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణ భయాలను పెంచాయి. దీనివల్ల ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచుతుందనే అంచనాలు బలపడి.. యుఎస్ డాలర్, ట్రెజరీ రాబడులు పెరిగాయి. ఫలితంగా సాంప్రదాయ సురక్షిత పెట్టుబడిగా బంగారం ఆకర్షణ తాత్కాలికంగా తగ్గింది.

Advertisement

మార్కెట్ యొక్క కచ్చితమైన కనిష్ట స్థాయి (Bottom) కోసం వేచి చూడటానికి ప్రయత్నించకుండా.. ధరలు తగ్గిన ప్రతిసారీ కొద్దికొద్దిగా కొనుగోలు చేయాలని MOFSL సలహా ఇచ్చింది. 12 నుండి 15 నెలల సమయం ఉన్న పెట్టుబడిదారులకు ఈ స్వల్పకాలిక తగ్గుదల ఒక మంచి ప్రవేశ అవకాశమని స్పష్టం చేసింది. ఇక వెండి విషయానికొస్తే, అది విలువైన లోహంతో పాటు పారిశ్రామిక లోహంగా కూడా పనిచేస్తుండటం వల్ల దాని ధరలలో హెచ్చుతగ్గులు, అస్థిరత (Volatility) మరింత ఎక్కువగా ఉంటాయని, వెండి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని బ్రోకరేజ్ సంస్థ హెచ్చరించింది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.