అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇంకా తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాయి. మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం బలమైన అమెరికా డాలర్, పెరిగిన యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చనే అంచనాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలు బంగారానికి కొంత మద్దతు ఇస్తున్నప్పటికీ, డాలర్ బలపడటం వల్ల ఆ ప్రభావం కొంత వరకే పరిమితమవుతోంది. అయితే స్వల్పకాలంలో బంగారం అస్థిరంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగినా లేదా ఫెడ్ వైఖరి ఊహించినదానికంటే సానుకూలంగా మారినా Gold ధరలకు మద్దతు లభించే అవకాశం ఉంది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానపరమైన నిర్ణయాల పట్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో Gold ధరలు బలహీనంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద అనిశ్చితి, మధ్యప్రాచ్యంలో చమురు మౌలిక సదుపాయాలపై దాడుల కారణముగా ముడి చమురు ధరలు పెరిగాయి.
ఓటీపీ లేకుండా 60 నిమిషాల్లో రూ. 78 లక్షలు మాయం.. కొత్త మోసపూరిత పద్దతులతో షాకిస్తున్న కేటుగాళ్లు..
ఇది ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణాన్ని పెంచి, ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణ వేగాన్ని మళ్లీ పెంచవచ్చనే ఆందోళనలను రేకెత్తించింది. చురుకైన ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నప్పటికీ, పెరుగుతున్న చమురు ధరల వల్ల యుఎస్ ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే సంకేతాలు ఇచ్చారు. దీనికి తోడు యుఎస్ డాలర్ మరియు ట్రెజరీ ఈల్డ్స్ స్థిరంగా ఉండటంతో రాబడినివ్వని ఆస్తిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గి, ధరలు ఒత్తిడిలోనే కొనసాగుతున్నాయి.
సాంకేతికంగా పరిశీలిస్తే.. బంగారం ధర ప్రస్తుతం 20-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ఒక అవరోహణ ఛానెల్‌లో ట్రేడ్ అవుతోంది. ఇది స్వల్పకాలికంగా మార్కెట్లో అమ్మకందారుల ఆధిపత్యాన్ని సూచిస్తోంది. బొలింజర్ బ్యాండ్స్ ప్రకారం, 20-రోజుల మూవింగ్ యావరేజ్ రూ. 143,473 వద్ద, ఎగువ బ్యాండ్ రూ. 147,760 వద్ద, దిగువ బ్యాండ్ రూ. 139,186 వద్ద ఉన్నాయి. బంగారం ప్రస్తుతం మధ్య బ్యాండ్ కంటే దిగువన ఉంటూనే దిగువ బ్యాండ్ వద్ద సాంకేతిక మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే రూ. 97,000 కనిష్ట స్థాయి నుండి రూ. 179,000 గరిష్ట స్థాయి వరకు విస్తరించిన ఫైబొనాచీ రీట్రేస్‌మెంట్ లెక్కల ప్రకారం.. బంగారం 38.2 శాతం (రూ. 147,700), 50 శాతం (రూ. 138,000) స్థాయిల నడుమ అత్యంత కీలకమైన నిర్ణయాత్మక ప్రాంతంలో ట్రేడ్ అవుతోంది.
గోల్డ్ ఈ వారం మార్కెట్ అంచనా
ఇన్వెస్టర్లు కొనుగోలు ఆపే స్థాయి (నష్టాలు దాటుకోవాలంటే)
ఆర్1: రూ. 143,500
ఆర్2: రూ. 147,700-147,800
ఆర్3: రూ. 152,000
సామాన్యుడు కొనుగోలు స్థాయి
ఎస్1: రూ. 140,000-139,200
ఎస్2: రూ. 138,000
ఎస్3: రూ. 135,000
ఈ వారం బంగారం మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తే.. రూ. 140,000 నుండి రూ. 139,200 పరిధిలో తక్షణ మద్దతు అంటే కొనుగోలు స్థాయి లభిస్తోంది. ఒకవేళ ఈ స్థాయి కంటే కిందకు జారితే రూ. 138,000, ఆ తర్వాత రూ. 135,000 వద్ద తదుపరి కీలక మద్దతు స్థాయిలు పనిచేస్తాయి. మరొకవైపు బంగారం తిరిగి కోలుకుని పుంజుకోవాలంటే మొదట రూ. 143,500 వద్ద ఉన్న మొదటి నిరోధకాన్ని దాటాల్సి ఉంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే ధరలు రూ. 147,700 నుండి రూ. 147,800 వైపు, ఆపై రూ. 152,000 స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరల గమనం, డాలర్ ఇండెక్స్, భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరల స్వభావాన్ని ప్రధానంగా నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- పసిడి ప్రియుల కొంపలు ముంచబోతున్న చైనా.. బంగారం ధరలు పెంచేందుకు బిగ్ స్కెచ్..
- Today Gold Silver Rate Live: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో పెరిగిన ధరలు
- బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. జూలై 21, మంగళవారం ధరలు ఇవే
- Gold News: వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో బంగారం ధర తగ్గుతుంది.. యెస్ సెక్యూరిటీస్ రిసెర్చ్ నివేదిక..!
- Today Gold Silver Rate Live: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..
- బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. జూలై 20, సోమవారం ధరలు ఇవే..