ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్ కాయిన్, డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ గురించి ఆయన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. తాజాగా ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం అతి పెద్ద మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబర్ట్ కియోసాకి గతంలో వేసిన అంచనాలే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. రాబర్ట్ కియోసాకి కొద్ది సంవత్సరాలుగా మార్కెట్ క్రాష్ గురించి పదేపదే చెబుతున్నారు.
అయితే ఆయన అంచనాలు చాలా వరకు తలకిందలయ్యాయి. ఉదాహరణకు 2023 నాటికి బిట్‌కాయిన్ 75 వేల డాలర్లకు చేరుతుందని, 2024 ఆగస్టులో 3.5 లక్షల డాలర్లకు వెళ్తుందని, 2025 చివరికి 5 లక్షల డాలర్లను తాకుతుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఆయన అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆయన స్టాక్ మార్కెట్ల సంబంధించి వేసిన అంచనాలు కూడా బిస్కెట్ అయ్యాయి. 2018లో చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందని చెప్పారు. కానీ అలా జరగలేదు. పైగా అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ దాదాపు 115 శాతం పెరిగింది. 2020, 2021 లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఏదీ నిజం కాలేదు.
ఆయన తాజాగా 2026లో అతి పెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందని అంచనా వేస్తున్నారు. దీన్ని ఎలా నమ్మాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది మాత్రం రాబర్ట్ కియోసాకి అంచనాలను నిజమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కియోసాకి తక్షణ మార్కెట్ కదలికల కంటే, అప్పుల భారం, కరెన్సీ విలువ, ఆర్థిక వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్యల గురించి హెచ్చరిస్తుంటారని కొంత మంది వాదిస్తున్నారు. ఆయన అంచనాలను జాగ్రత్తగా మాత్రమే చూడాలని కోరుతున్నారు. అయితే ఆయన ఇచ్చే సూచనలు పనికి వస్తాయని చెబుతున్నారు.
ముఖ్యంగా సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మనకు ఆదాయం ఇస్తోందో.. అందులో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఆలాగే బంగారంపై పెట్టుబడి పెట్డడం సురక్షితమని ఆయన పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. చివరి నిమిషంలో అంతా తలకిందులు.. తీవ్ర నష్టాలతో ముగిసిన షేర్ మార్కెట్..
- క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటే ఏమిటి.. నిఫ్టీ పతనమైతే.. సెన్సెక్స్ ఎందుకు పెరుగుతోంది..
- పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. ఈ కంపెనీ స్టాక్ మీద ఓ కన్నేసి ఉంచండి.. రూ. 15 వేల కోట్ల ఆర్డర్ వచ్చింది..
- Multibagger Stock: ఐదేళ్లలో 3,250 శాతం రాబడి ఇచ్చిన డిఫెన్స్ స్టాక్ ఇదే..!
- 20 నిమిషాల్లో 26 లక్షల షేర్లు అమ్మకం.. కుప్పకూలిన రూ.49 వేల కోట్ల విలువైన కంపెనీ షేర్లు.. కారణం ఇదే..
- స్టాక్ మార్కెట్ టుడే.. RBI నిర్ణయానికి ముందు అలర్ట్ అయిన ఇన్వెస్టర్లు.. లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ..