Pensions: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లపై కేంద్రం కీలక ప్రకటన.. OPS, NPS లపై ఏం నిర్ణయం తీసుకుందంటే..

Pensions: పాత, కొత్త పింఛను విధానాలపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) పేరిట మోడీ సర్కారు నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ పద్ధతిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. ఓల్డ్ పెన్షన్ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ సందర్భంగా పరిస్థితులను చక్కదిద్దడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. వాటిని పార్లమెంటులో నిన్న వివరించింది.

Advertisement

పాత vs కొత్త పెన్షన్ సిస్టమ్స్:

Advertisement

ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించనున్నట్లు లోక్‌ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించారు. పాత, కొత్త పింఛను విధానాలను ఈ ప్యానెల్ మళ్లీ పరిశీలించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల అవసరాలు మరియు ఆర్థిక ఖర్చుల మధ్య సమతుల్యతను సాధించే విధానంపై కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించే మార్పులను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు.

OPS వైపు BJP యేతర రాష్ట్రాల అడుగులు:

తాజాగా బీజేపీ యేతర పాలనలోని 5 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో కమిటీ ఏర్పాటు నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెబుతున్నారు. 64 సవరణలతో ఆమోదించబడిన ఆర్థిక బిల్లు, 2023 పరిశీలన సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు.

Advertisement

OPS అనుసరిస్తున్న రాష్ట్రాలివే..

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లు.. అధిక ప్రయోజనాలను అందించే పాత పెన్షన్ స్కీమ్ (OPS)కి తిరిగి మళ్లాయి. మహారాష్ట్రలోని బిజెపి -సేన (షిండే వర్గం) ప్రభుత్వం కూడా NPS కింద ఉన్నవారికి OPS బెనిఫిట్స్ ను విస్తరించడానికి ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఇదీ OPS బెనిఫిట్:

జనవరి 1, 2004 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు సంబంధించి OPSని పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ పరిశీలించడం లేదని ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. అయితే డిసెంబర్ 2003లో నోటిఫికేషన్‌ వెలువడిన పోస్టుల్లో చేరిన సిబ్బందికి మాత్రం వన్-టైమ్ ఆప్షన్‌ ను అనుమతించింది. OPS కింద, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతాన్ని నెలవారీ పెన్షన్‌గా పొందుతారు. దీనితోపాటు కరువుభత్యం రేట్ల పెంపుతో ఆ మొత్తం పెరుగుతూనే ఉంటుంది.

Advertisement

కొత్తగా GPSతో ముందుకొచ్చిన AP:

ఆంధ్రప్రదేశ్‌లోని YSRCP ప్రభుత్వం OPS, NPSలోని అంశాలను పరిశీలించి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ను ప్రతిపాదించింది. ఈ నమూనాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారని ఓ ప్రముఖ వార్తా సంస్థ గత నెలలో నివేదించింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక జీతంలో 10 శాతం జమ చేస్తే, చివరి జీతంలో 33 శాతం గ్యారెంటీ పెన్షన్ పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం సహకారం అందిస్తుంది. ఒకవేళ సిబ్బంది 14 శాతం అధికంగా కంట్రిబ్యూట్ చేసేందుకు సిద్ధమైతే చివరి వేతనంలో 40 శాతం పింఛను లభిస్తుంది.

English Summary

Central committee to look into OPS vs NPS..