బంగారం ధర గత కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చా లేదా అని చాలా మందికి సందేహంగా ఉంది. కొంత మంది తమ పిల్లల పెళ్లి కోసం ఇప్పుడే బంగారం కొంటుంటారు. కొందరు పెట్టుబడి కోసం పసిడిని కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్లు ఉన్నవారు ఎంత ధరైనా పెట్టి కొంటారు. అయితే పిల్లల పెళ్లిళ్లు, బంగారం పెట్టుబడి పెట్టేవారు నిపుణుల సలహాతో పుత్తడి కొనుగోలు చేస్తే బెటరని చెబుతున్నారు. మార్కెట్లో బంగారం ధర ఎప్పుడు కనిష్ట స్థాయికి పడిపోతుందో ఎవరికీ కచ్చితంగా తెలియదని. కాబట్టి ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తూ ఆగిపోవద్దని కొంత మంది సలహా ఇస్తున్నారు.
గత సంవత్సరం ఏప్రిల్ వరకు తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.లక్ష లూపే ఉండేది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1 లక్ష 43వేలకు పెరిగింది. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తగ్గేదాకా వేచి చూసే ధోరణిలో ఉన్నారని 'ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్' జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. మరోవైపు యుద్ధాలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులు పెట్రోల్ వంటి నిత్యావసరాలకే డబ్బులు దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. బంగారం ధర మళ్లీ లక్షకు పడిపోతుందని ఇప్పట్లో ఎవరూ ఆశించడం లేదని ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాణి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో ధరలు పూర్తిగా కుప్పకూలే అవకాశం అసలు లేదని ఆమె పేర్కొన్నారు. 2026 వరకు బంగారం ధర రూ. 1.4 లక్షల నుంచి రూ. 1.5 లక్షల మధ్యలోనే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే మార్కెట్లో 5 నుంచి 15 శాతం వరకు చిన్నగా తగ్గుదలలు రావడం సహజమేనని అన్నారు. దీన్ని ధరలు పడిపోయామని అనలేమని గుర్తు చేశారు. వార్తలు చూసి కంగారుపడిపోయి అమ్మకాలు, కొనుగోళ్లు చేయకుండా.. క్రమంగా పెట్టుబడి పెట్టడమే మంచిదని సూచించారు. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు నెలకు కొంత పెట్టుబడి పెట్టొచ్చని చెబుతున్నారు.
ఇందుకు సంబంధించి గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెట్టొచ్చని వివస్తున్నారు. అయితే బంగారం ధరలు భారీగా తగ్గాలంటే కొన్ని బలమైన ఆర్థిక కారణాలు ఉండాలని బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ తెలిపారు. అమెరికా డాలర్ బాగా బలపడాలని.. వడ్డీ రేట్లను భారీగా పెరగాలని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గిపోవడంతో సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్నారు. గ్లోబల్ ఎకానమీ పుంజుకుని, ఈక్విటీ మార్కెట్లు బలపడాలన్నారు. ఒకవేళ గరిష్ట స్థాయి నుంచి 10 నుంచి 20 శాతం వరకు బంగారం ధర తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Gold Price Today: శాంతించిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!
- Gold Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఇప్పుడే కొనేయండి..!
- Gold Price Today: శాంతించిన బంగారం ధర.. ఈ రోజు ధర తులం బంగారం ఎంతంటే..!
- Gold Price Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధర.. ఇప్పుడే కొనాలా..!
- Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇక పెరుగుతూనే ఉంటుందా..!
- Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!