మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. అయితే ఇందులో దీర్ఘకాలికంగా పెట్టుబడి మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్లు వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం వల్ల సగటు రాబడిని అందిస్తాయని చెబుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. పెట్టుబడిదారులు ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడంపై ఆలోచించవచ్చు. ఫోకస్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోను మెయిన్ంటెన్ చేయాలి. పెట్టుబడి విషయానికి వస్తే ఈ పథకాలకు ఇతర పరిమితులు లేవు. ఫ్లెక్సీ క్యాప్ పథకాల లాగా, ఇవి ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్, రంగాలలోనైనా పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఫండ్ లో ఫండ్ మేనేజర్ తన నమ్మకం ఆధారంగా స్టాక్‌లను ఎంచుకుని ఆ స్టాక్‌లో గణనీయమైన వాటాను తీసుకుంటారు. అంచనా సరైనదైతే అటువంటి పెట్టుబడులు భారీగా లాభాలను అందిస్తాయి. అయితే కొన్ని అంచనాలు తప్పయితే పథకం చాలా నష్టం వస్తుంది. మార్కెట్ కంటే ముందే స్టాక్స్ ను గుర్తించడంలో విజయం సాధిస్తే, అది పథకానికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయం తప్పయితే పథకం చాలా నష్టపోతుంది. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి.. సుమారు ఏడు సంవత్సరాల పెట్టుబడి కాలపరిమితిని కలిగి ఉంటే, మీరు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 30 స్టాక్‌లను కలిగి ఉండవచ్చు. ఆస్తులలో కనీసం 80% ఈక్విటీ, ఈక్విటీ-సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టాలి.
ఫండ్ మేనేజర్ ఎటువంటి పరిమితి లేకుండా లార్జ్, మిడ్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) ఒకే ఒక్క ఫోకస్డ్ ఫండ్ పథకాన్ని మాత్రమే కొనసాగించాలి. పోర్ట్‌ఫోలియోలో పరిమిత సంఖ్యలో కంపెనీలు ఉన్నందున, ఫండ్ మేనేజర్‌లు తమ అత్యంత ఆశాజనకమైన పెట్టుబడి ఆలోచనలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ కంపెనీలు బాగా రాణిస్తే, అవి ఫండ్ రాబడులను పెంచుతాయి.
మొదటిసారి ఈక్విటీలో పెట్టుబడి పెట్టే వారు, స్థిరమైన లేదా తక్కువ అస్థిరత గల రాబడులను కోరుకునే పెట్టుబడిదారులు, స్వల్పకాలిక పెట్టుబడి దృక్పథం ఉన్న పెట్టుబడిదారులు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల నష్ట పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఫండ్ లో చాలా రిస్క్ ఉంటుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Robert Kiyosaki: డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు.. వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం..!
- Robert Kiyosaki: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదన్న రాబర్ట్ కియోసాకి
- Bonds Vs Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి..!
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.. పైసలు పుట్టడమే కష్టమిక.. రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక..
- Robert Kiyosaki: ధనవంతుడు అంటే ఎవరు.. అసలు విషయం చెప్పిన రాబర్ట్ కియోసాకి..!
- Life Insurance: ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!