ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓపై భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఓకు భారీగా స్పందన వచ్చింది. అయితే ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిస్టింగ్ రోజు నిరాశ పరిచాయి. అంచనాలకు అనుగుణంగా లిస్ట్ కాలేదు. కేవలం 8 శాతం ప్రీమియంలో లిస్ట్ అయింది. ఆ తర్వాత స్టాక్ పడిపోతూ వస్తుంది. శుక్రవారం SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్ ధర 1 శాతం తగ్గి రూ.572.15కి చేరింది. ఇంట్రా-డే ట్రేడింగ్‌లో బీఎస్ఈలో ఈ స్టాక్ తన ఇష్యూ ధర అయిన రూ.574 కంటే దిగువకు పడిపోయింది. ఆ తర్వాత 1.7 శాతం పెరిగి రూ.587 వద్ద ముగిసింది. ఈ గరిష్ట స్థాయి రూ.625తో పోలిస్తే, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ స్టాక్ ధర దాదాపు 5 శాతం పడిపోయింది.

Advertisement

శుక్రవారం 1.8 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చివరి రోజున 41.6 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. ఇందులో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ 140.11 రెట్ల బిడ్లు వేశారు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 22.51 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 3.59 రెట్లు, వాటాదారులు 9.51 రెట్లు, ఉద్యోగులు 4.65 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేశారు. ఐపీఓకు ముందు 'యాంకర్ అలాట్‌మెంట్' ద్వారా కంపెనీ రూ.2,663 కోట్లను సమీకరించింది.

Advertisement

బ్లాక్‌రాక్ , గోల్డ్‌మన్ సాక్స్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నోమురా ఇండియా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి ప్రముఖ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ యాంకర్ అలాట్‌మెంట్‌లో పాల్గొన్నాయి. ఏఎంసీ పరిశ్రమలో ఎస్‌బిఐ ఏఎంసీ అత్యంత బలమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈక్విటాస్ బ్రోకరేజ్ వారు ఈ స్టాక్‌పై 'లాంగ్' రేటింగ్‌తో మార్చి 2027 నాటికి ఒక్కో షేరుకు టార్గెట్ ప్రైస్ రూ.627 గా నిర్ణయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అముండి అసెట్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేశారు.

Advertisement

ఎస్‌బిఐ ఫండ్స్ అనేది ఏయూఎం పరంగా భారతదేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ. ఇది వైవిధ్యభరితమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, పరిశ్రమలోనే అగ్రగామిగా ఉన్న నిర్వహణ సామర్థ్యంతో, మ్యూచువల్ ఫండ్ ఏయూఎం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPs), పాసివ్ అసెట్స్‌లో అగ్రగామిగా ఉంది. అయితే, ఆదాయాలు ఈక్విటీ మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉంటాయి. అలాగే మ్యూచువల్ ఫండ్ ఫీజు నిబంధనలలో ఏవైనా మార్పులు వస్తే అవి రాబడి, లాభదాయకతపై ప్రభావం చూపుతాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు పేర్కొన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.