గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్ హెచ్చరికలతో చమురు ధర ఎగబాకుతోంది. ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా హర్మూజ్‌ను దాటదని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా హర్మూజ్‌ మీదుగా వెళ్తోన్న రెండు నౌకలపై ఐఆర్‌జీసీ దాడి చేసింది. వాటిలో పేలుడు సంభవించిందని, అవి కదల్లేని స్థితిలో ఉన్నాయని ప్రకటించింది. అమెరికా దురాక్రమణ కొనసాగుతున్నంత కాలం ఇదే కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి.

Advertisement

జూలై 20న బ్రెంట్ క్రూడ్ 2 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 90 డాలర్ల పైన ట్రేడవుతుంది. బ్రెంట్ ఫ్యూచర్స్ 2.09 డాలర్లు అంటే 2.37 శాతం పెరిగి బ్యారెల్‌కు 90.19 డాలర్లకు చేరుకున్నాయి. గత వారం ముడి చమురు ధరలు 15.9 శాతం పెరిగాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు కూడా 1.71 డాలర్లు పెరిగింది. బ్యారెల్‌కు 84.20 డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్‌పై సోమవారం తెల్లవారుజామున అమెరికా మరోసారి దాడులు చేసింది. తమ సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకున్నామని, శక్తిమంతమైన దాడులు చేశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Advertisement

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ప్రతీగా.. కువైట్, బహ్రెయిన్‌లపై కూడా ఇరాన్ కొత్తగా దాడులు చేస్తుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక సంక్షోభం ఏర్పాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలు 80 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ముడి చమురు ధర పెరగడం భారత్ కు ఇబ్బందే. దీంతో రూపాయి బలహీన పడుతోంది. శుక్రవారం 96.28 వద్ద స్థిరపడిన భారత రూపాయి, సోమవారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే 96.41 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. సోమవారం భారత బెంచ్‌మార్క్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Advertisement

పశ్చిమ ఆసియాలో ఇలానే ఉద్రిక్తతలు కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్బీజీ గ్యాస్ ధరలు పెరిగే అవకాశం. జూన్ అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం జరిగింది. అయితే ఇరాన్ కు చెందిన ఐఆర్‌జీసీ పలు నౌకలపై దాడులు చేయడంతో అమెరికా ఇరాన్ పై దాడులు మొదలు పెట్టింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.