ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ డ్రాగన్ కంట్రీ చైనా.. తన బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుంటూ అంతర్జాతీయ పసిడి మార్కెట్‌ను శాసిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు దాదాపు 4,022 డాలర్ల నుండి 4,100 డాలర్ల మధ్య శ్రేణిలో కొనసాగుతోంది. ఈ రికార్డు స్థాయి ధరల నడుమ కూడా చైనా వెనక్కి తగ్గకుండా నిరంతరం భౌతిక బంగారాన్ని పోగుచేస్తుండటం ప్రపంచ మార్కెట్లను విస్మయానికి గురిచేస్తోంది. చైనా తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక అడుగులు కేవలం సాధారణ పెట్టుబడి మాత్రమే కాదని.. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతమని ప్రముఖ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కమోడిటీ డిస్కవరీ ఫండ్ వ్యవస్థాపకుడు, ది బిగ్ రీసెట్ ప్రసిద్ధ పుస్తక రచయిత విల్లెం మిడిల్‌కూప్ అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తాను ముందే ఊహించిన గ్లోబల్ మానిటరీ రీసెట్ నిశ్శబ్దంగా ఇప్పటికే ప్రారంభమైంది. జూన్ నెలలోనే చైనా దాదాపు 150 టన్నులకు పైగా బంగారాన్ని సేకరించిందని ఆయన అంచనా వేశారు.
చైనాలో ప్రస్తుతం Gold, వెండికి ఉన్న డిమాండ్ గతేడాదితో పోలిస్తే ఏకంగా 150 శాతం నుండి 200 శాతం వరకు పెరిగిందని ఆయన తెలిపారు. చైనా కేంద్ర బ్యాంకు (PBoC)తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన ఇతర ఆర్థిక సంస్థలు కూడా మార్కెట్లో ధరలు కొద్దిగా తగ్గగానే భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అయితే అధికారికంగా వెలువడుతున్న గణాంకాలకు.. చైనా వద్ద ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC), చైనా అధికారిక వర్గాల ప్రకారం జూన్ నెలలో చైనా సెంట్రల్ బ్యాంక్ సుమారు 14.93 టన్నుల (దాదాపు 15 టన్నులు) బంగారాన్ని మాత్రమే అధికారిక నిల్వల్లోకి చేర్చింది.
కానీ చైనా వద్ద ఉన్న అసలు బంగారం నిల్వలు ఈ ప్రకటనల కంటే చాలా రెట్లు ఎక్కువని మిడిల్‌కూప్ వాదిస్తున్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాతి నుండి చైనా.. భారతదేశంతో సహా సిల్క్ రోడ్ పరిధిలోని ఆసియా దేశాలు ఏకంగా 50 వేల టన్నులకు పైగా బంగారాన్ని పోగుచేసుకున్నాయని.. డాలర్ ఆధిపత్యం తగ్గించుకునేందుకు ఇవి భౌతిక బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.
పసిడి ప్రియుల కొంపలు ముంచబోతున్న చైనా.. బంగారం ధరలు పెంచేందుకు బిగ్ స్కెచ్..
అమెరికా డాలర్ వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి.. ఆర్థిక ఆంక్షల నుండి రక్షణ పొందడానికి చైనా చేపడుతున్న ఈ భారీ Gold సేకరణ వ్యూహం రాబోయే రోజుల్లో బంగారం ధరలను మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని గ్లోబల్ కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో స్వల్ప ఉడుదుడుకులకు గురవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ పరంగా చూస్తే.. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు (31.1 గ్రాములు) సుమారు 4,022.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
భారతదేశంలో (దేశీయ మార్కెట్) చూస్తే.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర సుమారు రూ. 1,45,860 (గ్రాముకు రూ. 14,586) వద్ద కొనసాగుతోంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ. 1,33,600 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Gold Price: బంగారం తొందరపడి కొనుగోలు చేస్తున్నారా.. అయితే నష్టపోతారు..!
- బంగారం ధరలు భారీగా తగ్గాయి.. పసిడి రేటు ఈ రోజు తగ్గుదలతో ఎంతకు దిగివచ్చిందంటే.. జూలై 28, మంగళవారం ధరలు ఇవే..
- బంగారం ధరలు ఈ రేటును దాటి పెరిగే అవకాశం లేదు..సామాన్యులకు పండగే అంటున్న ఆర్థిక నిపుణులు
- దుబాయ్ బంగారంపై దిమ్మదిరిగే న్యూస్.. ప్రమాదంలో భారత పసిడి సరఫరా.. స్తంభించిపోయిన యూఏఈ గోల్డ్ కోట్..
- పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. జూలై 27, సోమవారం ధరలు ఇవే..
- Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో స్వల్ప మార్పులు..