డబ్బులుంటేనే బిజినెస్ చేయవచ్చని చెబుతారు. అవును ఇది నిజమే. కానీ.. తక్కువ మొత్తంతో కూడా బిజినెస్ చేయవచ్చని నిరూపించారు హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ వ్యవస్థాపకుడు ఆర్జీ చంద్రమోగన్ . ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఇంట్లో పరిస్థితి బాగోలేక.. ఆయన మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం కేవలం నెలకు రూ.65 జీతానికి పని చేశారు. ఆ డబ్బుతో ఆయన సంతృప్తి చెందలేదు. వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే తన వద్ద డబ్బు లేకపోవడంతో తండ్రి వద్దకు వెళ్లాడు. దీంతో తండ్రి తనకున్న పొలం అమ్మి రూ.13 వేలు చంద్రమోగన్ చేతిలో పెట్టాడు. ఆ డబ్బుతో చంద్రమోగన్ చిన్న షెడ్ లో ఐస్ క్యాండీల వ్యాపారం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆయన బిజినెస్ భారీగా అభివృద్ధి చెందింది.
రూ.13 వేలతో ప్రారంభించి ఆయన వ్యాపారం నేడు రూ.20 వేల కోట్ల కంపెనీగా మారింది. ఆ కంపెనీ ప్రస్తుతం రూ.10 వేల కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఆర్జిస్తుంది. చంద్రమోగన్ 1970లో చెన్నైలోని రాయపురంలో 250 చదరపు అడుగుల చిన్న షెడ్‌లో తన బిజినెస్ ప్రారంభించాడు. మొదట ముగ్గురు కార్మికులు, 15 తోపుడు బండ్లతో అరుణ్ పేరుతో ఐస్ క్యాండిలు తయారు చేశారు. వారికి తొలి ఏడాది రూ.1.5 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఐస్ క్రీమ్ అప్పటికీ అంత ఫేమస్ కాలేదు. ప్రధాన ఐస్ క్రీమ్ బాండ్రు ప్రధాన నగరాలకే పరిమితం అయ్యాయి. దీంతో చంద్రమోగన్ చిన్న పట్టణాలపై దృష్టి పెట్టారు. అలాగే గ్రామీణ మార్కెట్ పై కూడా దృష్టి పెట్టారు.
చిన్న పట్టణాలు, గ్రామాలకు తమ అరుణ్ ఐస్ క్యాండిలు చేర్చి విక్రయించడం మొదలు పెట్టారు. అరుణ్ ఐస్ క్యాండిల్ టేస్ట్ బాగుండడంతో తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. అయితే ఐస్ క్రీమ్ అనేది వేసవి కాలంలోనే ఎక్కువ అమ్ముడవుతాయి. మిగతా సీజన్లలో వ్యాపారం అంతగా నడవదు. దీన్ని గుర్తించిన చంద్రమోహన్.. ఎప్పుడు గిరాకీ ఉండే మిల్క్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. హాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ తో డెయిరీ బిజినెస్ లోకి ప్రవేశించారు. ఆ కంపెనీ టర్నోవర్ 1992లో రూ.3 కోట్లుగా ఉండేది. అప్పుడు 40 మంది ఉద్యోగులు వారి కంపెనీలో పని చేశారు.
అయితే క్రమంగా వారి ప్రొడక్ట్స్ ను విస్తరిస్తూ దేశంలోనే ప్రముఖ డెయిరీ కంపెనీల్లో ఒకటిగా హాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ నిలిచింది. ఆ కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 8683 కోట్ల ఆదాయం, రూ. 272 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 9973 కోట్లకు చేరుకుంది. ఆ కంపెనీకి 6 రాష్ట్రాల్లో 22 ఆధునిక తయారీ యూనిట్లు ఉన్నాయి. 10 వేల గ్రామాల్లోని దాదాపు 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తారు. సాధారణ స్థాయి నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగి అందరికి ఆదర్శంగా నిలిచిన చంద్రమోగన్ కు 2025లో పద్మశ్రీ పురస్కారం వచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Success Story: మ్యాగీ అమ్ముతూ రోజుకు రూ.5 వేలు సంపాదిస్తున్న వ్యక్తి..!
- Ram Chandra Agarwal: పడిలేచిన కెరటం.. రామ్ చంద్ర అగర్వాల్.. వైకల్యాన్ని జయించి విజయం సాధించాడు..
- Success Story: ఉదయం కాలేజీ.. సాయంత్రం వ్యాపారం.. రోజుకు రూ.25 వేల ఆదాయం..!
- Success Story: నెయిల్ పాలిష్ వేస్తూ నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్న మహిళ..!
- ముగిసిన 'ఫండింగ్ వింటర్'! ఇండియన్ స్టార్టప్‌ల జోరు.. ఐపీఓ దిశగా తెలుగు కంపెనీల దూకుడు!
- ఐటీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఓలా డ్రైవర్‌గా మారిన టెక్కీ సక్సెస్ స్టోరీ!