ఉద్యోగులకు షాకిచ్చేందుకు ప్రముఖ కార్ల దిగ్గజం రెడీ అయింది. వచ్చే ఏడాది నాటికి దాదాపు 8 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుక కసరత్తు చేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ ప్రీమియం కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) తన నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భాగంగా జర్మనీలోని తన సిబ్బందిపై గణనీయమైన ప్రభావం చూపే నిర్ణయం తీసుకోనుంది. 2027 చివరి నాటికి సంస్థలో సుమారు 8 వేల ఉద్యోగాలను తగ్గించే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా జర్మనీలోని దాదాపు సగం మంది శాశ్వత సిబ్బందికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది.
జర్మనీలో ఉన్న దాదాపు 85 వేల మంది శాశ్వత ఉద్యోగులలో సుమారు 40 వేల మందికి ఈ ఏడాది అక్టోబర్ నుండి స్వచ్ఛంద విరమణ ఆఫర్లు అందనున్నాయి. అయితే ఫ్యాక్టరీల్లో పనిచేసే ప్రొడక్షన్ లైన్ కార్మికులకు ఈ కోతల నుండి మినహాయింపునిస్తూ.. కేవలం ఆఫీస్/డెస్క్ ఆధారిత ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తింపజేస్తున్నారు. కంపెనీ నిర్వహణ బోర్డు, వర్క్స్ కౌన్సిల్ మధ్య సుమారు ఆరు వారాల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,54,000 మంది ఉద్యోగులు ఉన్న బిఎమ్‌డబ్ల్యూ, 2027 నాటికి 8 వేల మంది ఉద్యోగుల తగ్గింపు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం జర్మన్ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాలపై తగ్గుతున్న లాభ మార్జిన్లు, అమెరికా విధించే సుంకాలు, ప్రధానంగా చైనా ఆటోమొబైల్ కంపెనీల నుండి ఎదురవుతున్న తీవ్ర పోటీ కారణంగా నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం అనివార్యంగా మారింది. ఇతర పోటీదారులైన వోక్స్‌వ్యాగన్ (1,00,000 ఉద్యోగాల కోత ఆలోచన), మెర్సిడెస్-బెంజ్ (స్వచ్ఛంద విరమణ కార్యక్రమం) తరహాలోనే బిఎమ్‌డబ్ల్యూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంది.
రూ. 40 లక్షల జీతం..ఎందుకు సంపాదిస్తున్నానో తెలియదు..రాత్రిళ్లు నిద్ర రావడం లేదంటూ బోరుమంటున్న ఉద్యోగి..
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లను సమాంతరంగా నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లూ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ, చైనా మార్కెట్‌లో ఊహించని మందగమనం బిఎమ్‌డబ్ల్యూపై తీవ్ర ప్రభావం చూపింది. చైనాలో బిఎమ్‌డబ్ల్యూ వాహనాల డెలివరీలు 2017 తర్వాతి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోగా.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఏకంగా 30 శాతం మేర క్షీణించాయి. తీవ్ర పోటీ, చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల కార్ల అమ్మకాలు తగ్గి, గత నెలలో కంపెనీ తన లాభాలపై అనూహ్యమైన హెచ్చరికను కూడా జారీ చేయాల్సి వచ్చింది.
More Articles
- గుడ్ న్యూస్..సగం ధరలకే మందుతో పాటు లగ్జరీ కార్లు.. కారణం ఏంటంటే..
- BMW sports bike: కళ్లు చెదిరే ఫీచర్స్: జస్ట్ రూ.3,999 ఈఎమ్ఐకే
- వహ్: ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన చెన్నై కంపెనీ
- కొనాలనుకుంటున్నారా.. జనవరి 1 నుండి ఈ వాహనాల ధరలు పెరుగుతున్నాయ్
- BMWలో 6,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ ఒప్పందం, యువతకు జాబ్ గ్యారెంటీతో...
- సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్: ఆడి, మెర్సిడెజ్ కార్ల కంపెనీలతో ఓలా చర్చలు