బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు డికె శివకుమార్ సర్కారు కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన సిల్క్ బోర్డ్ జంక్షన్ నుండి కేఆర్ పురం (KR Puram) మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) మార్గం త్వరలోనే సరికొత్త హంగులతో ప్రయాణికుల ముందుకు రానుంది.
బెంగళూరు స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (B-SMILE) సిద్ధం చేసిన సమగ్ర నివేదిక ప్రకారం.. ఈ కారిడార్‌లో సాధారణ వాహన రవాణాతో పాటు ప్రత్యేక బస్సు లేన్లు, సైకిల్ లేన్లు, ఎలివేటెడ్ నమ్మ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. Bengaluru నగరంలో రవాణా ప్రాధాన్యతను మెరుగుపరచడంతో పాటు పట్టణ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ మార్గంలోని ఆరు కీలక కూడళ్లను ఆధునీకరించనున్నారు. ఈ జంక్షన్ల వద్ద ఉన్న ఫ్లైఓవర్ల కింద ప్రస్తుతం వృథాగా ఉన్న ఖాళీ స్థలాలను సృజనాత్మకంగా ఉపయోగించుకుని.. ప్రజల కోసం ఆకర్షణీయమైన కమ్యూనిటీ స్పేస్‌లుగా మార్చే యోచన చేస్తున్నారు. ఇక్కడ సీటింగ్ లాంజ్‌లు, చిన్న తరహా మార్కెట్లు, క్రీడా కోర్టులు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యంగా డెలివరీ భాగస్వాములు, గిగ్ వర్కర్ల కోసం నీడతో కూడిన కూర్చునే ప్రదేశం.. మొబైల్ ఛార్జింగ్ లాకర్లు, ఉచిత వై-ఫై, తాగునీటి సదుపాయాలతో కూడిన గిగ్ హబ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనితో పాటు సౌరశక్తితో పనిచేసే ఛార్జింగ్ పాయింట్లతో మైక్రో-మొబిలిటీ డాక్‌లు, అలాగే డిజిటల్ క్యూ వ్యవస్థ కలిగిన ఆటో-రిక్షా నిరీక్షణ కేంద్రాలను కూడా సిద్ధం చేయబోతున్నారు.
బెంగళూరు పోలీసులు కొత్త రూట్.. ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెంపు.. కారణం ఏంటంటే..
అధికారుల ప్రజెంటేషన్ వివరాల ప్రకారం.. పౌరుల రాకపోకల కోసం ఫుట్‌పాత్‌పై స్పష్టంగా గుర్తించబడిన సైకిల్ లేన్, సాధారణ వాహనమార్గంలో ఎరుపు రంగు పట్టీతో సూచించే బస్సు లేన్‌ను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రెండూ రోడ్డుపై భౌతికంగా వేరు చేయబడవు. కాగా దీనిపై పౌర హక్కుల కార్యకర్తలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బస్ లేన్లు రోడ్డు మధ్యలో మీడియన్ పక్కన ఉండి, భౌతిక డివైడర్లతో వేరు చేసినప్పుడు మాత్రమే ఇతర వాహనాలు రాకుండా ప్రభావవంతంగా పనిచేస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
బి-స్మైల్ సంస్థ ఈ రహదారిని అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానించే ఒక అధునాతన మొబిలిటీ కారిడార్ గా తీర్చిదిద్దుతోంది. ఐటీ/టెక్ పార్కులకు సురక్షితమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను కల్పించడంతో పాటు, మెట్రో స్టేషన్లు, బస్ స్టాండ్లను సజావుగా ఏర్పాటు చేస్తారు. వర్షాకాలంలో రోడ్లు జలమయం కాకుండా ఉండటానికి సమర్థవంతమైన వర్షపునీటి డ్రైనేజీ వ్యవస్థను కూడా అక్కడ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఓఆర్ఆర్ కారిడార్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 6.42 లక్షల మంది ఉద్యోగులు 3.38 లక్షల వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ కొత్త మౌలిక సదుపాయాల కల్పన వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి.. గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
More Articles
- నెలకు రూ.2 లక్షల జీతం..అప్పుల్లేవు.. అయినా బతకడం కష్టంగా ఉందంటున్న బెంగళూరు టెకీ..
- జీతాల పెంపులో బెంగళూరు, ముంబైకి షాక్.. చిన్న పట్టణాల్లో ఉద్యోగులకు భారీగా వేతనాలు.. కారణాలివే
- బెంగళూరు పోలీసులు కొత్త రూట్.. ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెంపు.. కారణం ఏంటంటే..
- బెంగళూరు ప్రయాణికులకు బిగ్ అలర్ట్..ఈ రూట్లో రాత్రివేళ ఫ్లైఓవర్ మూసివేత.. వెళితే బుక్కయిపోతారు జాగ్రత్త..
- Bengaluru News: రెండు గంటలు నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు..
- బెంగళూరు ట్రాఫిక్ అలర్ట్..హెబ్బాల్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లేవారు జాగ్రత్త.. మరో భారీ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్..