భారతీయులకు బంగారం చాలా ఇష్టం. ముఖ్యంగా దక్షిణ భారతదేశం వారికి పసిడిపై మక్కువ ఎక్కువ. అందులో మహిళలు బంగారాన్ని చాలా ఇష్టపడతారు. అందుకే పెళ్లి సమయంలో పెళ్లి కూతురు భారీ స్థాయిలో బంగారం పెడుతుంటారు. అయితే బంగారం కొనేటప్పుడు దాని నాణ్యతను తప్పకుండా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పసిడి నాణ్యతను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పుత్తడి ఆభరణాలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. అయితే ఇప్పటికే చాలా మంది హాల్ మార్కింగ్ లేకుండానే బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నారు. ఈ విషయం భారతీయ ప్రమాణాల బ్యూరో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైయింది.
తెలంగాణలోని 13 జిల్లాల్లో జరిగిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్‌మార్క్ లేని బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఒక్క వరంగల్‌లోనే దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అటు ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో హాల్ మార్క్ లేని బంగారం అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. భారతీయ ప్రమాణాల బ్యూరో అక్కడ కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. ఇక హాల్ మార్కింగ్ అనేది బంగారం నాణ్యతను తెలుపుతుంది. అలాగే హెచ్‌యూఐడీ కూడా ఉంటుంది. పసిడి కొనుగోలు చేసేటప్పుడు వీటిని తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
హాల్‌మార్క్ అనేది బంగారు ఆభరణం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇచ్చే నాణ్యత ధ్రువీకరణ మార్క్. భారతీయ ప్రమాణాల బ్యూరో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బంగారం స్వచ్ఛతను పరీక్షించిన తర్వాతే హాల్ మార్కింగ్ ఇస్తారు. హెచ్‌యూఐడీ అనేది ప్రతి హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే ఆరు అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్.ఇది ప్రతి ఒక్క బంగారం ఆభరణంపై ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఆభరణాన్ని అస్సేయింగ్ సెంటర్‌లో పరీక్షించివచ్చు. ఆ ఆభరణానికి ఎప్పుడు హాల్‌మార్క్ చేశారనేది తెలుసుకోచ్చు.
హాల్‌మార్క్ చేసిన బంగారు బీఐఎస్ లోగో ఉంటుంది. బంగారం స్వచ్ఛత ఉంటుంది. 22 క్యారెట్ల ఆభరణానికి 916, 18క్యారెట్ల నగకు 750, 14 క్యారెట్ల ఆభరణానికి 585 ఉంటుది. వినియోగదారులు BIS Care మొబైల్ యాప్ ద్వారా లేదా BIS వెబ్‌సైట్‌లో HUID నంబర్‌ను నమోదు చేసి ఆభరణానికి సంబంధించిన వివరాలను ధ్రవీకరించవచ్చు. అందుకే బంగారం కొనుగోలు చేసేపటప్పుడు హాల్‌మార్క్ ఉందో లేదో పరిశీలించాలి. HUID కోడ్‌ను తప్పనిసరిగా వెరిఫై చేసేకోవాలి. BIS రిజిస్టర్డ్ జువెలర్ వద్ద నుంచే బంగారం కొనుగోలు చేయాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు దెబ్బకు పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. జూలై 23, గురువారం ధరలు ఇవే..
- బంగారం ధరలు తగ్గడం కష్టమే.. సామాన్యులు ఆశలు వదిలేసుకోవాలంటున్న గోల్డ్‌మన్ సాక్స్.. కారణం ఏంటంటే..
- Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- భారీగా పెరిగిన బంగారం ధరలు.. పసిడి రేటు ఈ రోజు ఎంత పైకి వెళ్లిందంటే.. జూలై 22, బుధవారం ధరలు ఇవే..
- బంగారం ధరలు మళ్లీ పరుగులు.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో లబోదిబోమంటున్న సామాన్యులు..
- పసిడి మార్కెట్లో ఇప్పుడు ఏం జరగబోతోంది.. రహస్యంగా 44 వేల కిలోల బంగారాన్ని అమ్మేసిన రష్యా..