మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో థీమాటిక్ మ్యూచువల్ ఫండ్లు కూడా అద్భుతమైన రాబడి ఇస్తాయి. అయితే ఇందులో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే థీమాటిక్ ఫండ్లలో కూడా మంచి రాబడి అందించిన మ్యూచువల్ ఫండ్ల గురించి తెలుసుకుందాం. మూడేళ్ల CAGR రాబడుల పరంగా హెచ్ డీఎఫ్ సీ డిఫెన్స్ ఫండ్ అగ్రస్థానంలో ఉంది. జూలై 29 నాటి మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం ఈ ఫండ్ 37.9 శాతం రాబడిని అందించగా, ఎస్బీఐ పీఎస్యూ ఫండ్ 22.5 శాతం, ఐసీఐసీఐ ఫ్రు ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ మంచి రాబడిని అందించింది. ఆదిత్య బిర్లా పీఎస్యూ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రు ఈక్విటీ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ అందించింది.
కనీసం రూ. 1,500 కోట్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు కలిగిన పథకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే టాప్ ఐదు ఫండ్లలో, HDFC డిఫెన్స్ ఫండ్ రూ. 10,529.2 కోట్ల అతిపెద్ద కార్పస్‌ను కలిగి ఉంది. మూడేళ్ల ప్రాతిపదికన బెంచ్‌మార్క్ 8.5% రాబడిని ఇవ్వగా, HDFC డిఫెన్స్ ఫండ్ దాని బెంచ్‌మార్క్ 29.3 శాతం రిటర్న్స్ అందించింది. అలాగే ఏడాది ప్రాతిపదికన కూడా బెంచ్‌మార్క్ -1.2% రాబడిని ఇవ్వగా, ఇది దాని బెంచ్‌మార్క్ కంటే 25.5 శాతం ఎక్కువ రిటర్న్స్ అందించింది.
ఒక నెలలో చూస్తే ఇక్కడ ఐసిఐసిఐ ప్రూ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ 6.2 శాతంతో జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మూడు నెలల ప్రాతిపదిక క్రమంలో ఐదు పథకాలలో ఐసిఐసిఐ ప్రూ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ 10.0 శాతంతో అత్యంత బలమైన రాబడిని అందించింది. ఒక సంవత్సరం ప్రాతిపదికన కూడా ఈ ఆధిక్యత రాబడి ఇచ్చింది. థీమాటిక్ ఫండ్‌లు ఒకే మార్కెట్-క్యాప్ విభాగానికి బదులుగా ఒక నిర్దిష్ట పెట్టుబడి థీమ్ చుట్టూ పెట్టుబడి పెడతాయి. అందువల్ల వాటి రాబడులు వైవిధ్యభరితమైన ఈక్విటీ కేటగిరీలకు భిన్నంగా ఉండవచ్చు.
అయితే థీమాటిక్ ఫండ్లలో నెగటివ్ రిటర్న్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఐటీ, టెక్నాలజీ థీమాటిక్ ఫండ్స్ రాణించడం లేదు. ఫ్లాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫడ్ సంవత్సర కాలంలో -4.98 శాతం ఎస్బీఐ టెక్నాలజీ ఫండ్ -3.56, టాటా డిజిటల్ ఫండ్ -6.73 శాతం రాబడి ఇచ్చాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Mutual Funds: ఒడిశాలో మ్యూచువల్ ఫండ్ కోర్సులు.. యూనివర్సిటీ, కాలేజీల్లో అందుబాటులో..!
- Mutual Funds: గత 10 ఏళ్లలో సిప్పై అత్యధిక రాబడి ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లు ఇవే..
- Mutual Fund SIP: మ్యూచువల్ ఫండ్లలో సిప్ ఎప్పుడు నిలిపివేయాలంటే..!
- Bonds Vs Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి..!
- Pharma Sector Mutual Funds: ఐదేళ్లలో మంచి రాబడి ఇచ్చిన ఫార్మా మ్యూచువల్ ఫండ్లు..!
- Mutual Funds: ఒకే కంపెనీ స్టాక్‌ను 40 మ్యూచువల్ ఫండ్లు కొనుగోలు చేశాయి..!