స్మార్ట్ ఫోన్లు కొనేవారికి షాక్ తలగనుంది. స్మార్ట్ ఫోన్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చు కారణంగా గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకే యాపిల్‌, శాంసంగ్‌ వంటి పలు కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ గతంలోనే ధరలను పెంచాయి. తాజాగా ప్రపంచంలోనే నంబర్‌వన్‌ చిప్‌ తయారీ సంస్థ తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చిప్‌ ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఒక వేళ చిప్ ధరలు పెరిగితే.. వచ్చే సంవత్సరంలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

6 ఎన్‌ఎం కంటే తక్కువ ఉండే చిప్‌లతో పాటు 28ఎన్‌ఎం, 16ఎన్‌ఎం, 12ఎన్‌ఎం చిప్‌లు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఏఐకి డిమాండ్ పెరగడంతో మొబైల్ మెమొరీ విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు ఫోన్ల ధరల్ని సగటున 15 శాతం మేర పెంచాల్సి వచ్చింది. ధరల పెంపు ప్రభావం సామాన్యులపై పడడంతో ఫోన్ల విక్రయాలు పడిపోయాయి. రూ. 15 వేల లోపు బడ్జెట్ ఫోన్ల విక్రయాలు 45 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనీస్ బ్రాండ్ల మార్కెట్ వాటా 2020 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

మార్చిలో శాంసంగ్, వివో, ఐకూ కంపెనీలు ఫోన్ల ధరలను భారీగా పెంచాయి. చైనా కంపెనీలైన రెడ్ మీ, పోకో కూడా స్మార్ట్ ఫోన్ల ధరలను రూ.1000 నుంచి రూ.2,500 పెంచింది. వివో టీ4, ఐక్యూ జడ్ 10 సిరీస్ ఫోన్లపై గరిష్టంగా వేరియెంట్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2,500 వరకు పెంచాయి. ఏఐ డేటా సెంటర్ల డిమాండ్, మెమెరీ చిప్‌ల కొరత వల్ల మొబైల్స్ తయారు చేసేందుకు కంపెనీలకు ఖర్చు పెరిగింది. దీంతో కంపెనీలు పెరిగిన ధరలను ఎండ్ యూసర్ కు పాస్ చేస్తున్నాయి. మార్చిలో శాంసంగ్ ఎఫ్ 17,ఏ 36, ఏ 56 మోడల్ స్మార్ట్ ఫోన్లపై రూ.2 వేల వరకు పెంచింది. ఇక పోకో సీ 75 మోడల్ ఫోన్‌పై రూ.2 వేలు పెంచింది. అందుకే స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పడిపోయాయి.

Advertisement

ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆలోచనలు మార్చుకుంటున్నాయి. మాస్ మార్కెట్‌ను ఆకట్టుకునేందుకు చాలా కంపెనీలు మళ్లీ 4G స్మార్ట్ ఫోన్ పోర్ట్‌ఫోలియోపైకి దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిప్ ధరలు పెరుగుతాయన వార్తలు వస్తున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.