అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 8,500 కోట్ల విలువైన అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ప్రాజెక్టును దక్కించుకున్నట్లు శుక్రవారం ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో ఆ సంస్థ ఆర్డర్ల విలువ రూ. 80,000 కోట్లకు పైగా పెరిగింది. కేంద్రం టారిఫ్-ఆధారిత బిడ్డింగ్ విధానం ద్వారా ఈ ప్రాజెక్టును అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ సొంత చేసుకుంది. ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టులకు విద్యుత్‌ను తరలించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్, వైజాగ్ ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టును తీసుకొచ్చారు. రాబోయే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా కేంద్రాల నుంచి 4,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను సులభతరం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయనున్నారు. ఇది పెందుర్తి-వైజాగ్ ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చనుంది. అలాగే ఇక్కడ ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాలకు విద్యుత్ అందించనున్నారు.
ఈ ప్రాజెక్టును వైజాగ్ పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక ప్రయోజన సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి (వైజాగ్)లో 765/400 kV GIS సబ్‌స్టేషన్, ఖమ్మం-IIలో మరో 765/400 kV సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు రాకతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ తన ట్రాన్స్‌మిషన్ పోర్ట్‌ఫోలియోలో కొత్తగా 1,582 సర్క్యూట్ కిలోమీటర్లు చేరనున్నాయి. ట్రాన్స్‌మిషన్ లైన్లు, 10,500 MVA నిర్మాణంతో సామర్థ్యం పెరగనుంది. దీనితో మొత్తం ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ 29,531 సర్క్యూట్ కిలోమీటర్లకు, సామర్థ్యం 1,33,675 MVAకు పెరుగుతుందని కంపెనీ తెలిపింది.
భారతదేశ నెక్ట్స్ జనరేషన్ పారిశ్రామిక వృద్ధికి అవసరమైన ఇంధన వెన్నెముకను నిర్మించడంలో వైజాగ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన ముందడుగని కంపనీ పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సామర్థ్య అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. అదే సమయంలో పెందుర్తి-వైజాగ్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మౌలిక సదుపాయాల డిమాండ్ గ్రిడ్‌ను ఏర్పాటు తీర్చనుందని ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- గుజరాత్లో ఆదాని గ్రూపు భారీ పెట్టుబడులు .. దేశంలోనే అతి పెద్ద బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం
- కరెంట్ సరఫరా కంపెనీని మార్చుకునేందుకు వెసులుబాటు.. పోర్టబిలిటీ ఆప్షన్ ఎప్పటినుంచి అంటే..
- Adani Stock: తొలిత్రైమాసికంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ భారీ నష్టాలు.. స్టాక్ పరిస్థితి..?
- ఏపీలో రూ.13 కోట్ల జాబ్ స్కామ్.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వందలాది మందిని మోసం చేసిన కపుల్స్..
- AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం..!
- రైల్వే కోడూరులో 15 వేల ఎకరాలకు లైన్ క్లియర్.. అతుకు బడి పట్టాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..