దేశంలో ఈ20 పెట్రోల్ పై నిరంతరం చర్చ జరుగుతోంది. ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల వాహనాల చెడిపోతున్నాయని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త కార్లు కూడా షెడ్డుకు వెళ్తున్నాయని వాపోతున్నారు. ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల వాహన ఇంజన్లు దెబ్బతింటాయని పేర్కొంటారు. ఇంజన్లు దెబ్బతినడమే కాకుండా మైలేజ్ కూడా తగ్గుతుందని భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ20 పెట్రోల్ వాడాలని సూచిస్తోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ గురించి మాట్లాడితే దేశ ద్రోహులని ముద్ర వేస్తున్నారని కొంత మంది చెబుతున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో నటుడు నరేశ్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంపై స్పందించారు. ఇథనాల్ పెట్రోల్ వల్ల కలిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ముందుగా ఆయన ఒక మాట చెప్పారు. తాను దేశ ద్రోహిని కానని చెప్పి.. ఈ20 పెట్రోల్ వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు. ఇథనాల్ పెట్రోల్ వల్ల బైక్ వాడే వారి నుంచి ఖరీదైన కార్లు వాడేవారి వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడు, బీజేపీ సానుభూతిపరుడు టయోటా కామ్రీ కారు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఆ కారు కొద్ది రోజులు నడపగానే ఇంజన్ వాల్వులు మార్చాల్సి వచ్చిందని అన్నారు. ఇందుకోసం అతను రూ.3.5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వివరించారు.

Advertisement

అదే తన కొత్త కారు పోర్షే పనామెరాకు ఇలా జరిగితే దాదాపు రూ.12 లక్షలు అవుతాయని అన్నారు. నా కారు పాడు కాకూడదనే ఈ20 పెట్రోల్ వాడడం లేదని చెప్పారు. లీటర్ కు రూ.165 లీటరైన హై ఆక్టేన్ 100 పెట్రోల్ వాడుతున్నట్లు చెప్పారు. బైక్ వాలేదా ఇతరుల వాహనాలు వాడేవారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ప్లాన్ ఎ, బి & సి లతో కూడిన బలమైన మేధోమథన బృందం ఉందన్నారు. కోట్లాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని కాపాడాలనే ఈ నిర్ణయం ఖచ్చితంగా చాలా తొందరపాటుగా చర్యగా ఆయన అభివర్ణించారు.

Advertisement

ఈ నిర్ణయం బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ అని చెప్పారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు కూడా ఇథనాల్‌ను దశలవారీగా విజయవంతంగా అమలు చేసి సఫలమయ్యాయని నరేశ్ గుర్తు చేశారు. ఈ20 పెట్రోల్ తట్టుకునే వాహనాలు దేశంలో తక్కువగా ఉన్నాయని పలువురు మెకానిక్ లు చెబుతున్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం వల్ల ఇంజన్ లోని పలు పార్ట్స్ దెబ్బతింటున్నట్లు చెబుతున్నారు.