ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగుల జీతాల పెంపు విధానంలో కీలక మార్పులను తీసుకొచ్చింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ వేతన నమూనా భారతదేశంలోని సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీ సిబ్బందికి జూన్ జీతాల సమీక్ష ప్రక్రియ నుండి అమలులోకి వచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం ఒక ఉద్యోగికి ఆమోదించబడిన మొత్తం జీతం పెంపులో కేవలం 50 శాతం మాత్రమే వారి శాశ్వత మూల వేతనానికి (Base Pay) జోడించడం జరుగుతుంది.
మిగిలిన 50 శాతం మొత్తాన్ని జూన్ నెలలో ఒకేసారి ఏకమొత్తంగా నగదు రూపంలో విడిగా చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 3 శాతం జీతం పెంపు ఖరారైతే, అందులో 1.5 శాతం భాగం మాత్రమే ప్రతి నెల వచ్చే మూల వేతనంలో పెరుగుతుంది. మిగిలిన 1.5 శాతం మొత్తాన్ని జూన్‌లో ఒకే విడతలో నగదుగా పొందుతారు. అయితే పదోన్నతి పొందిన ఉద్యోగులకు లభించే పెంపును మాత్రం 100 శాతం వారి మూల వేతనానికే యాడ్ చేస్తారని కంపెనీ తెలిపింది. అలాగే జూన్‌లో ఇచ్చే ఈ ఏకమొత్తం నగదు చెల్లింపునకు.. ప్రతి ఏటా డిసెంబర్‌లో నిర్వహించే వార్షిక బోనస్ సైకిల్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.
ఈ నూతన నమూనా వెనుక ఉన్న ఉద్దేశాలను Accenture వెల్లడిస్తూ.. గత ఏడాది పరిమిత సంఖ్యలోనే మూల వేతన పెంపులు జరిగాయని, అయితే ఈసారి పెంపును శాశ్వత జీతం, ఏకమొత్తం నగదుగా విభజించడం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులకు మూల వేతన పెంపు పరిధిలోకి తీసుకురావడానికి వీలు కలిగిందని కంపెనీ పిటిఐతో పంచుకున్న మెమో ద్వారా వివరించింది. అంతేకాకుండా ఈ విధానం వల్ల ఉద్యోగుల చేతికి తక్షణమే ఎక్కువ నగదు అందుతుందని కంపెనీ భావిస్తోంది. వేతన చెల్లింపు పద్ధతి మారినప్పటికీ.. అప్రైజల్ నిర్ణయాలు మాత్రం ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరు, ప్రాజెక్టు ప్రభావం, ప్రవర్తన ఆధారంగానే కొనసాగుతాయి.
ఐటీ రంగంలో రక్తపాతం.. యాక్సెంచర్ ఫలితాలతో భయాందోళనలో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ఎందుకు అంతలా కుప్పకూలింది..
కాగా ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. తక్షణ నగదు లభ్యత బాగున్నప్పటికీ.. మూల వేతనం ఆశించిన స్థాయిలో పెరగకపోవడం పట్ల కొందరు అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా, ఈ ఒకేసారి చెల్లించే మొత్తంపై పన్నులు ఏ విధంగా వర్తిస్తాయి. ఈ విధానం కేవలం ఈ ఏడాదికే పరిమితమా లేక భవిష్యత్తులోనూ కొనసాగుతుందా అనే అంశాలపై ఉద్యోగులు స్పష్టత కోరుతున్నారు. గ్లోబల్ ఐటీ రంగంలో వ్యయ నిర్వహణ ప్రాధాన్యంగా మారిన తరుణంలో.. శాశ్వత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు ఇటువంటి వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
More Articles
- టీసీఎస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. హైక్ ఇచ్చినట్లే ఇచ్చి జీతంలో కొంత కట్ చేసిన టెక్ దిగ్గజం..
- Variable Pay: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టీసీఎస్.. వేరియబుల్ పే భారీ కోత, వరుసగా రెండోసారి..
- IT News: టెక్కీలకు శుభవార్త చెప్పిన Infosys.. ఉద్యోగుల ఖాతాలో బోనస్ అమౌంట్, ఎంతంటే?
- variable pay: టెక్కీలకు షాకిచ్చిన TCS.. వేరియబుల్ పే ఎత్తేసిన ఐటీ కంపెనీ..!!
- TCS News: ఉద్యోగుల ఆఫీస్ హాజరుపై TCS చీఫ్ HR హ్యాపీ.. ఆ నిర్ణయమే సక్సెస్ మంత్ర..
- Infosys News: మరింత నిరాశలోకి ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. సిబ్బంది ఆశలు గల్లంతు