యువత తమ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారనే దానిపై బెంగళూరుకు చెందిన ఒక మహిళ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా, 20 ఏళ్ల వయసులో ఉన్న చాలా మంది ఖరీదైన జీవనశైలిని ఎందుకు ఎంచుకుంటున్నారని ఆమె తన వీడియోలో ప్రశ్నించారు. గత ఏడు నెలలుగా బెంగళూరులో నివసిస్తున్న సిమ్రిధి మఖిజా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో యువత ఖర్చులపై మాట్లాడారు. ప్రజలు ఆర్థికంగా ఉనప్పటికీ, తనకు అర్థం కాని కొన్ని ఖర్చు చేసే అలవాట్ల గురించి ఆమె వివరించారు.

Advertisement

బెంగళూరులో ఏడు నెలలు గడిపిన తర్వాత కూడా, ప్రజలు ఒకేసారి కేఫ్‌లలో రూ. 5,000 ఖర్చు చేయడం, రూ. 20,000కే మంచి ఇల్లు దొరుకుతుండగా రూ. 40,000 అద్దెతో ఖరీదైన ఇంట్లో ఉండటం లేదా ఒకేసారి షాపింగ్‌కు రూ. 20,000 ఖర్చు చేయడం వంటివి చేస్తున్నారని మఖిజా తన వీడియోలో తెలిపారు. 20 ఏళ్ల వయసులో ఉన్నవారు డబ్బు పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలని తాను భావిస్తున్నందున, అటువంటి ఖర్చులను భరించగలిగే వారి గురించి కూడా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని వివరించారు. ఆదాయం పెరిగినంత మాత్రాన జీవన ప్రమాణాలు కూడా ఆటోమేటిక్‌గా పెరగకూడదని ఆమె గుర్తు చేశారు. భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది కాబట్టి, ప్రజలు ఎక్కువ సంపాదించడం, కనీస అవసరాలకు మాత్రమే ఖర్చు చేయడం, సాధ్యమైనంత ఎక్కువ పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

Advertisement

ఆదాయం పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెంచే 'లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్' (జీవనశైలి వ్యయాల పెరుగుదల) అంశంపై ఆమె ప్రధానంగా మాట్లాడారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు అధిక జీతం రావడం అంటే ఖర్చులు కూడా అంతే స్థాయిలో పెరగాల్సిన అవసరం లేదని మఖిజా పేర్కొన్నారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. డబ్బు పొదుపు చేయడంపై ఆమె అభిప్రాయాలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు తాము సంపాదించిన డబ్బును ఆస్వాదించాలని కూడా అన్నారు. జీవనశైలి వ్యయాల పెరుగుదల (లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్) మీ జీతంలో పెరిగిన మొత్తాన్ని ఖర్చు చేయకండని అన్నారు.

Advertisement

20 ఏళ్ల వయసులో డబ్బు పొదుపు చేయడంపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టకంని మరొకరు కామెంట్ చేశారు. మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. డబ్బు ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడితే ఎంత జీతం వచ్చిన సరిపోదని నిపుణులు చెబుతున్నారు. జీతం పెరిగినప్పుడు ఖర్చులు పెంచడం వల్ల జీవన శాలిలో మార్పు వస్తుంది.. ఆర్థిక స్వేచ్ఛ రాదన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.