దేశంలో యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. రూ.5 నుంచి లక్ష వరకు యూపీఐలో చెల్లిస్తున్నారు. అయితే మనం యూపీఐ చెల్లింపు చేయాలంటే.. ఫోన్ లో నెట్ ఉండాలి. అప్పుడే మనం పేమెంట్ చేయగలం. అయితే ఇప్పుడు నెట్ లేకుండా కూడా యూపీఐ పేమెంట్ చేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఫోన్, పీఓఎస్ టెర్మినల్ రెండూ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేసే ఎన్ఎఫ్సీ-ఆధారిత యూపీఐ చెల్లింపులను ఎన్పీసీఐ అభివృద్ధి చేస్తోంది. ఈ విధానంలో రూ. 2,000 వరకు మాత్రమే లావాదేవీ జరిపేలా పరిమితి విధించినట్లు తెలుస్తోంది. రెండు పరికరాలకు ఇంటర్నెట్ సదుపాయం లేనప్పటికీ, ఒక వినియోగదారుడు వ్యాపారి పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్ వద్ద చెల్లించడానికి వీలు కల్పించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ను అభివృద్ధి చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2026లోనే ప్రముఖ టెర్మినల్ తయారీదారులు తయారు చేసిన PoS పరికరాలకు ధృవీకరణ ఇవ్వడం ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపాదిత ఈ వ్యవస్థ నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుందని ఓ నివేదిక పేర్కొంది. ఆఫ్‌లైన్ టెర్మినల్‌పై NFC-సామర్థ్యం గల ఫోన్‌ను ట్యాప్ చేయడం ద్వారా రూ. 2,000 వరకు చెల్లింపులు చేయవచ్చని సమాచారం. అయితే ఈ ఫీచర్ ను మొదటగా.. విమాన క్యాబిన్‌లు, భూగర్భ రైలు నెట్‌వర్క్‌లతో సహా, కనెక్టివిటీ అందుబాటులో లేని లేదా నమ్మదగినదిగా లేని ప్రదేశాల కోసం ఈ ఫీచర్ రూపొందించారని ఓ బిజినెస్ పోర్టల్ తెలిపింది.
ఈ ఫీచర్ లో భాగంగా వినియోగదారులు నెట్ ఉన్నప్పుడు ముందుగా వారి పరికరంలోని యూపీఐ లైట్ వాలెట్‌లోకి డబ్బును లోడ్ చేసుకోవాలి. వారు UPI పిన్ ఎంటర్ చేయకుండానే ఆఫ్‌లైన్ టెర్మినల్‌లో ఆ బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లో యూపీఐని స్వీకరించడానికి పీఓఎస్ కంపెనీలకు ఎన్పీసీఐ నుంచి సర్టిఫికేషన్ అవసరమని చెబుతున్నారు. సర్టిఫికేషన్ పొందిన తర్వాత వారు దానిపై ఒక అప్లికేషన్‌ను సృష్టించుకోవచ్చు తెలుస్తోంది. PoS టెర్మినల్ అనేది డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, మొబైల్-వాలెట్ చెల్లింపులను స్వీకరించడానికి సాధారణంగా ఉపయోగించే హార్డ్‌వేర్.
డబ్బులు స్వీకరించే వ్యాపారి ఎన్పీసీఐ ధృవీకరించిన PoS టెర్మినల్ ద్వారా చెల్లింపును స్వీకరిస్తారు. దీనికి రూ. 2,000 గరిష్ట పరిమితిగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆర్‌బిఐ ఆఫ్‌లైన్ డిజిటల్-చెల్లింపుల ఫ్రేమ్‌వర్క్, ఒక సాధారణ ఆఫ్‌లైన్ లావాదేవీని రూ. 500గా ఉంది. కాగా జూన్ 2026లో యుపీఐ రూ. 28.92 లక్షల కోట్ల విలువైన 22.72 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. భవిష్యత్ ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- UPI: యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఛార్జ్.. అదీ రూ.2 వేలు దాటితేనే..!
- UPI Payments: పొరపాటున వేరే నంబర్‌కు యూపీఐ చేశారా.. అయితే ఈ పని చేయండి..!
- యూపీఐ పిన్ అవసరం లేదు! బయోమెట్రిక్ పేమెంట్స్‌తో సెకన్లలో లావాదేవీలు - సరికొత్త రికార్డు!
- Google pay: ట్రెండ్ అవుతున్న గూగుల్ పే పాకెట్ మనీ ఫీచర్! ఇదెలా పని చేస్తుందంటే..
- ఇప్పుడు యూత్ ఏం కొంటున్నారో తెలుసా? గ్యాడ్జెట్లు, బట్టలు కాదు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు!
- UPI లాగా అంతర్జాతీయ చెల్లింపులను మరింత సులభతరం చేయనున్న స్కైడో..