టెక్నాలజీతో జీవనశైలిలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక్కప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే.. దుకాణానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే వస్తువును కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలు, చికెన్, మటన్, ఎగ్స్, నిత్యావసరాలు కూడా యాప్స్ లో బుక్ చేస్తున్నారు. ఆటో, క్యాబ్ కూడా ఇంట్లో ఉండే బుక్ చేస్తున్నారు. ఫుడ్ కూడా ఆన్ లైన్ లో బుక్ చేస్తున్నారు. దీంతో ఈ కామర్స్, క్విక్ కామర్స్ బిజినెస్ భారీగా పెరుగుతోంది. దీంతో పాటు చాలా మందికి ఉపాధి కూడా పెరుగుతోంది. ఈ కామర్స్ కంపెనీలు.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్రా, మీ షో, ఇండియా మార్ట్, ఏజియోతో పాటు చాలా ఉన్నాయి.
ఇక క్విక్ కామర్స్ లో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్ స్టా మార్ట్, బిగ్ బాస్కెట్, ఫ్లిపి కార్ట్ మినట్స్, జియో మార్ట్, అమెజాన్ ఫ్రెష్ వంటి కంపెనీలు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో, ఇట్ స్యూర్, టోయింగ్ వంటి యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. దేశంలో మొబైల్ యాప్‌ల ఆధారిత సేవల్లో పనిచేసే గిగ్ శ్రామిక శక్తి రాబోయే రోజుల్లో పెరుగుతుందని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ పేర్కొంది. గిగ్ వర్కర్లు భారీగా సంపాదిస్తున్నట్టు తెలిపింది. సాధారణ ఉద్యోగుల కంటే ఫుల్ టైమ్ గిగ్ కార్మికులు 2.5 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని ఇందులో ప్రస్తావించింది.
గిగ్ వర్కర్ల సంఖ్య 2030 నాటికి 2.1 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దాదాపు మూడు రెట్లు పెరిగి 1.7 కోట్ల నుంచి 2.1 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం 60 లక్షల మంది గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ గిగ్ వర్కర్లను సర్వే కూడా చేసింది. 54 శాతం మంది గిగ్ ప్లాట్‌ఫారమ్‌లలో చేరకముందు ఎలాంటి వేతన ఉపాధి చెప్పారు. 2030 నాటికి వచ్చే కార్మికులలో 30 శాతం మంది మొదటిసారి పనిలోకి వచ్చే వాళ్లే ఉంటారని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. దాదాపు 70 శాతం మంది భవిష్యత్‌లో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నారని వివరించింది. గిగ్ వర్కర్లలో 90 శాతం మంది పార్ట్ టైమ్ పనిని ఎంచుకుంటున్నారు.
ఇతర సాంప్రదాయ ప్రభుత్వ, ప్రైవేట్ (ఫార్మల్) ఉద్యోగాలు, అసంఘటిత రంగంలోని ఉపాధితో పోలిస్తే.. గిగ్ రంగంలో పూర్తి సమయం పనిచేసే కార్మికులు నెలకు 2.5 రెట్లు అధిక నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నారని నివేదికలో తెలిపింది. గిగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో తమ ఆదాయ అవకాశాలను మెరుగుపరుస్తుందని దాదాపు 70 శాతం మంది కార్మికులు నమ్ముతున్నారని పేర్కొన్నారు.
More Articles
- తెలంగాణలో గిగ్ వర్కర్స్ బిల్లుకి ఆమోదం! దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే..
- Moonlighting: రెండు ఉద్యోగాలకు 'OK' చెప్పిన ఇన్ఫోసిస్.. పండగ చేసుకుంటున్న టెక్కీలు
- Flipkart Goat Sale: ఫ్లిప్ కార్ట్ లో గోట్ సేల్.. ఐ ఫోన్‌పై రూ.22 వేలు తగ్గింపు..!
- ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: ఎస్బీఐ కార్డు ఉందా? ఈ రాత్రితో ముగియనున్న భారీ డిస్కౌంట్!
- Flipkart sale: ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ వస్తోంది! ఐఫోన్ 17, ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు!
- రిపబ్లిక్ డే సేల్ ధమాకా! ఐఫోన్లు, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ స్టోర్‌లో తక్కువ ధరంటే?