జీవితంలో ఏ విజయం సులభంగా రాదు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే గెలుపు నీ సొంతం అవుతుంది. ఇలానే ఓ యువకుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి విజయం సాధించాడు. కానీ ఆ గెలుపునకు కారణం అతని అమ్మే. దాదాపు ప్రతి వ్యక్తి విజయం వెనక తల్లిదండ్రుల కష్టం ఉంటుంది. వారు ఎంత కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేయాలనుకుంటారు. మన గెలిస్తే వారు సంబరపడిపోతారు. అందుకే ప్రతి వ్యక్తి విజయం వెనక తల్లిదండ్రుల త్యాగం ఉంటుంది. తాజాగా బెంగళూరులో మైక్రోసాఫ్ట్ లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న మను అగర్వాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
ఒకప్పుడు తన పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పాడు. కాలేజీ ఫీజు కట్టేందుకు తన వద్ద కనీసం రూ.15000 లేని స్థితి నుంచి ఈ రోజు మైక్రోసాఫ్ట్ లో సంవత్సరానికి రూ.1.90 కోట్ల జీతం తీసుకునే స్థాయికి వచ్చానంటే.. దానికి కారణం తన అమ్మేనని చెప్పాడు. తను బీసీఏ చదివే రోజుల్లో కాలేజీ ఫీజ్ రూ.15000 వేలుకు చెల్లించడానికి తన తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు. అయితే తన చదువు ఆగిపోకూడదని తన తల్లి బంగారు నగలు అమ్మి కాలేజీ ఫీజు కట్టినట్లు చెప్పాడు. ఈ ఘటన తన జీవితంలో ఎప్పటికీ మారిపోలేనని అన్నాడు.
తన చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకు నగలు కొనుక్కోమ్మని తన అమ్మకు చెప్పినట్లు సియాటిల్ లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో పని చేస్తున్న మను అగర్వాల్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన తల్లి ఇచ్చిన సమాధానంతో తన కళ్లలో నీళ్లు వచ్చాయని చెప్పాడు. మను ఝాన్సీలో పుట్టి పెరిగాడు. అక్కడే హిందీ మధ్యమంలో చదువుకున్నాడు. తర్వాత బుందేల్‌ఖండ్ యూనివర్సిటీలో బీసీఏ పూర్తి చేశాడు. నిట్ తిరుచిరాపల్లి నుంచి మాస్టర్స్ చేశాక.. మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌షిప్ సాధించి, అనంతరం అమెరికాలో ఉద్యోగ అవకాశాన్ని సాధించాడు. మైక్రోసాఫ్ట్ ఇంటర్న్‌గా ఉన్నప్పుడు రాత్రి 1 గంట వరకు పనిచేసేవాడిని మను గుర్తు చేసుకున్నాడు.
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవాలను మను అగర్వాల్ వివరించాడు. గూగుల్ తనకు బెటర్మెంట్ నేర్పితే.. మైక్రోసాఫ్ట్ లోతైన బాధ్యత, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కల్పించిదని చెప్పుకొచ్చాడు. తన విజయం వెనుక తన తల్లిదండ్రుల త్యాగమే అసలైన ప్రేరణ అని మను అగర్వాల్ స్పష్టం చేశారు. దాదాపు ఎవరైనా తల్లిదండ్రు త్యాగంతోనే ఈ స్థితికి చేరుకుంటారని అభిప్రాయపడ్డాడు.
More Articles
- Intel: ఇంటెల్‌లో మరోసారి లే ఆఫ్స్.. ఈసారి ఎంత మంది ఔటయ్యారంటే..!
- మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్.. 3200 మందిని తీసేస్తున్నట్లు కీలక ప్రకటన.. ఎందులో అంటే..
- ఏడాదికి రూ.1.6 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని కంటెంట్ క్రియేటరయ్యాడు.. చివరకు చేసిన తప్పు తెలుసుకుని..
- Lay Off's\": ఊడిపోతున్న సాఫ్ట్ వేరు జాబ్స్.. ఉద్యోగుల తొలగింపులో 2వ స్థానంలో నిలిచిన భారత్..!
- నాలుగు రోజుల పతనం తర్వాత ఐటీ షేర్లకు జోష్..5% ఎగిసిన ఇన్ఫోసిస్..కారణం ఏంటంటే..
- Microsoft lay off: ఉద్యోగులకు షాక్.. 5,500 మందిని తొలగించనున్న మైక్రోసాఫ్ట్..!