ఐఫోన్ హిందూ మతానికి వ్యతిరేకమని ఓ వ్యక్తి ఆరోపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి యాపిల్ సంస్థను హిందూ వ్యతిరేకిగా అభివర్ణించారు. అందుకు గల కారణాన్ని కూడా అతడు వివరించారు. యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ సిరి అస్సలాము అలైకుమ్ అనే పలకరింపునకు రెస్పాండ్ అవుతుందని చెప్పాడు. అయితే జై శ్రీరామ్ అన్నప్పుడు మాత్రం సిరి నిశబ్దంగా ఉంటుందని అతడు ఆరోపించారు. ఆరోపించడం కాదు ఓ వీడియో కూడా చేశాడు.
యూపిల్ వర్చువల్ అసిస్టెంట్ సిరి ముందు జై శ్రీరామ్ అన్నారు. అయితే సిరి స్పందించలేదు. అందుకే యాపిల్ సంస్థ హిందువులకు వ్యతిరేకమని అంటున్నారు. ఐఫోన్ వాయిస్ అసిస్టెంట్ హిందూ విశ్వాసాలను అగౌరవ పరుస్తోందని ఆరోపించారు. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మీడియాతో అన్నారు. ఐఫోన్ అనేది భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలని దెబ్బ తీస్తున్నారని చెప్పారు. సిరి అస్సలామ్ అలైకుమ్ కు సమాధానం ఇస్తుందని కానీ జై శ్రీ రామ్ అన్నప్పుడు స్పందించడం లేదని వివరించారు.
ఇది ఉజ్జయినీ అలాగే దేశంలోని కోట్లాది మంది హిందువులు ఐఫోన్లు వాడుతున్నారని గుర్తు చేశారు. కానీ యాపిల్ సంస్థ మమ్మల్ని మోసం చేస్తుందని అన్నారు. అలాగే తమ డేటా కూడా యాపిల్ వద్ద ఉందన్నారు. ఇది మా హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. తన వాదనకు మద్దతుగా, ఆయన సిరికి జై శ్రీ మహాకాల్, జై శ్రీ రామ్ ఆదేశాలు ఇచ్చి, ఆ వాయిస్ అసిస్టెంట్‌ను మీడియా ముందు ప్రదర్శించారు.
దేశంలో ఐఫోన్‌లు ఒక హోదా చిహ్నంగా మారాయని, వాటి ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది అప్పు చేసి ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యక్తి ఆరోపణలపై యాపిల్ స్పందించలేదు. దేశంలో చాలా మంది ఐఫోన్ వాడుతున్నారు. ముఖ్యంగా ఉన్నత వర్గాల వారు దాదాపు ఐ ఫోన్లే వాడుతున్నారు. దీని ధర కూడా అధికంగానే ఉంటుంది. సెక్యూరిటీ కోసం కూడా ఐఫోన్లు వాడుతున్నట్లు తెలుస్తోంది.
More Articles
- భారత్‌లో మరో కొత్త బంగారు గనిని కనుగొన్న శాస్త్రవేత్తలు..100 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు
- బంగారంపై మనకు కరువు తీరబోతోంది.. జబల్పూర్లో భారీగా బంగారు నిల్వలు గుర్తింపు..
- రైతుకు ఏడాదికి రూ.3 జీతం, నెలకు 25 పైసలు.. ఛాయ్ కూడా రాదని నెటిజన్లు ఫైర్..అసలు కథ ఏంటంటే..
- 40 ఏళ్ళ వయసులో రూ. 20 వేలతో వ్యాపారంలోకి..పస్తులతో నిద్రలేని రాత్రులు, కట్ చేస్తే..
- నగరాల్లో గోబర్-ధన్ ప్లాంట్లు: రెండేళ్లల్లో 75 చోట్ల: మోడీ ప్రకటన
- మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌పై, రాజస్థాన్‌లో డీజిల్‌పై పన్ను ఎక్కువ