సంపాదనకు చదువుతో సంబంధం లేదని చెబుతుంటారు. అవును ఇది నిజమే.. పీజీ, పీహెచ్‌డీలు చేసిన వారు సంపాదించని డబ్బులు చదువుకోని వారు, చాలా తక్కువ చదువుకున్నవారు సంపాదిస్తున్నారు. దీన్ని బట్టి సంపాదనకు చదువు సంబంధం లేదని అర్థమవుతుంది. చాలా మంది ఆఫీస్ లకు వెళ్లి రోజంతా కష్టపడితే నెలకు రూ.30 వేలు రావడం లేదు. అదే రోడ్డుపై చాయ్ అమ్మె వ్యక్తి రోజుకు రూ.1500 సంపాదిస్తున్నాడు. కూరగాయలు అమ్మేవారు, తినుబండారాలు అమ్మేవారు ఇలా చాలా మంది రోజుకు రూ.1000 నుంచి రూ.1500 సంపాదిస్తున్నారు.

Advertisement

ఓ వ్యక్తి అయితే రోజుకు ఏకంగా రూ.5 వేలు సంపాదిస్తున్నాడు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై చోలే-కుల్చే విక్రయిస్తున్న ఓ వ్యక్తి రూ. 5 వేలు, నెలకు రూ.1,50,000 సంపాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతోంది. కోమల్ నేగి అనే సోషల్ మీడియా ఇన్ప్లూ యెన్సర్ వీధి వ్యాపారితో ఓ వీడియో చేసింది. ఆ వీధి వ్యాపారి మ్యాగీ, చోలే-కుల్చే అమ్ముతూ రోజుకు రూ.5 వేలు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. అతని సమాధానికి ఆశ్చర్యపోయిన కోమల్ నిజమా అంటూ అడిగారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నీ పనే బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.

Advertisement

సంపాదన ఒక్కటే కాదు.. ఖర్చులు కూడా చూడాలి కదా అని అంటున్నారు. అతను ఎండ, వానలో రోడ్డు పక్క నిలబడి పని చేస్తున్నాడు. మ్యాగీ, చోలే-కుల్చే చేయడానికి అతడికి ముడి సరకులు కావాలి. అంతేకాకుండా గ్యాస్ కూడా అవసరం అన్ని పోను అతనికి మిగిలేది తక్కువేనని చెబుతున్నారు. అయితే రూ.1.5 లక్షల నుంచి రూ.50 వేలు ఖర్చులు తీసేసిన.. మిగతా రూ.లక్ష ప్రాఫిటే కదా అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. అతను కష్టపడి సంపాదిస్తున్నాడు.. తప్పు లేదు. మనం కూడా కష్టపడితే సంపాదించవచ్చని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ వీడియో చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ గుర్తుకు వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ ఎదురుగా ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ రోజువారీ కౌంటర్ సుమారు రూ. 60,000 వరకు ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఖర్చులు పోను ఆమె నెలకు సుమారు రూ. 1.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు సంపాదిస్తారని అంచనా. అయితే కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె స్థూల ఆదాయం నెలకు రూ. 18 లక్షల వరకు ఉంటుందని స్వయంగా తెలిపారు. దీన్ని బట్టి సంపాదనకు చదువుతో సంబంధం లేదని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.