ఆంధ్రప్రదేశ్ ప్రజలను సేవ్ చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకో తెలుసా?

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై జాతీయస్థాయిలో భారత్ బంద్ నిరసనకు మధ్య సోమవారం జరిగింది. కానీ బంద్ జరిగిన కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సోమవారం రికార్డు స్థాయికి చేరాయి ప్రధమంగా నాలుగు పట్టణాలలో ముందుగా ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88 రూపాయిలు ఉంది. పెట్రోల్ రిటైలర్ల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో లీటరుకు రూ. 80.73 రూపాయలు, ముంబయిలో లీటరుకు 88.12 రూపాయలు చెన్నైలో లీటరుకు రూ. 83.91 రూపాయలు, కోల్కతాలో లీటరుకు

రూ. 83.61 రూపాయలు. డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 72.83 రూపాయలు, రూ. ముంబయిలో లీటరుకు రూ. 77.32 రూపాయలు, చెన్నైలో లీటరుకు రూ. 76.98 రూపాయలు, కోల్కతాలో లీటరుకు రూ. 75.68 చేరుకుంది.

చంద్రబాబు నాయుడు

కానీ ఇంతలో ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రజల పై భారం పడకుండా ఉండాలి అని పెట్రోల్ మరియు డీజిల్ మీద పన్ను తగ్గించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పెట్రోల్,మరియు డీజిల్ ధరల పెంపుపై లీటరుకు రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి పెట్రోలు ధర లీటర్ రూ. 84.71 రూపాయలు, డీజిల్ రూ. ధర 77.98 రూపాయలకు చేరుకుంది.దింతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మీద భారం పడే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ

ఇక గత పది రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ వారు సోమవారం భారత్ బంద్ కి పిలుపించింది. ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పెట్రోల్ మరియు డీజిల్ పై పన్ను తగ్గించాలి అని నిర్ణయం తీసుకోవడం విశేషం.

రెండో ముఖ్యమంత్రిగా

పెట్రోల్ మరియు డీజిల్ ధరల రూ.2 రూపాయిల పై పన్ను కట్ చేయడంలో చంద్రబాబు నాయుడు రెండో ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇలా తగ్గించిన రేట్లు ఆంధ్రరాదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ధరలు అమలు లోకి వస్తాయి.

అసెంబ్లీలో

ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ధర తగ్గింపును ప్రకటించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సామాన్య ప్రజలు పెరుగుతున్న ధరల ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కనుక ధరలను తగ్గించేందుకు కేంద్రం ముందుకు రావాలి అని అయన అన్నారు.

రూపాయి

ఇరాక్ మరియు అమెరికా ఆంక్షలు, డాలర్ పై రూపాయి పతనానికి గురవడంతో చమురు ధరలు పెరిగాయి. నిన్న, రాజస్థాన్ వసుంధరా రాజే పెట్రోల్ మరియు డీజిల్ మీద ఇదే విధమైన కట్ ప్రకటించారు.

కేంద్రం

దేశంలో చమురు ధరలు మరియు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరతో ముడిపడివున్నాయి. కానీ దాని మీద, కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ పన్నులు విధించడం చాలా బాధాకరం. ఎక్సైజ్ సుంకం తగ్గినట్లయితే రిటైల్ ధరల తగ్గింపు మాత్రమే జరుగుతుంది ఈ సందర్భంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నష్టాన్నిభరించాలి లేదా చమురు సంస్థలు నేరుగా దానిని భరించాలి.

మొదటి స్థానంలో

ఇక భారతదేశంలో పెట్రోల్ పై విలువ ఆధారిత పన్నుఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 35.77 శాతంలో మొదటి స్థానంలో ఉంది తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ డీజెల్ కోసం 28.08 శాతం చొప్పున విలువ ఆధారిత పన్ను ఉంది.

Read more about: petrol

Have a great day!
Read more...

English Summary

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu announced a cut of Rs. 2 per litre on fuel prices, effective from Tuesday.