దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) అయిన ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ జూలై 14న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11,692 కోట్లను సేకరించనుంది. దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ అయినప్పటికీ, లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే ఎస్‌బిఐ ఫండ్స్ తక్కువ వాల్యూవేషన్ లోనే వస్తుంది. ఎస్‌బిఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ.12.51 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ ఆస్తులను పర్యవేక్షిస్తోంది. అసెట్ మేనేజ్మెంట్ రంగంలో 15.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయినప్పటికీ మిగతా ఏఎంసీలతో పోలిస్తే తక్కువ పీఈలో వస్తోంది. ఎస్బీఐ ఫండ్లు ఆస్తుల నిర్వహణ పరంగా మార్కెట్ లీడర్‌గా ఉన్నప్పటికీ, ఎస్బీఐ ఫండ్స్ సుమారు 35 బేసిస్ పాయింట్ల రెవెన్యూ రాబడి ఆర్జిస్తోంది.

Advertisement

దీనితో పోలిస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సుమారు 52 బేసిస్ పాయింట్లు, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 44 బేసిస్ పాయింట్ల రెవెన్యూ రాబడి ఆర్జిస్తున్నాయి. ఎస్బీఐ ఏఎంసీ ఎక్కువ డబ్బును మెయింటెన్ చేస్తున్నప్పటికీ పోటీదారుల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎస్బీఐ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో సుమారు 32.4% ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌తో సహా పాసివ్ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టింది. దీనితో పోలిస్తే ఐసీఐసీఐ ఏఎంసీ పోర్ట్‌ఫోలియోలో పాసివ్ అసెట్స్ వాటా సుమారు 13.1% కాగా, హెచ్డ్పీఎఫ్సీ ఏఎంసీలో ఇది 9.4%గా ఉంది. అందుకే కాస్త తక్కువలో వాల్యూవేషన్ లో ఐపీఓ వస్తోంది.

Advertisement

ప్రస్తుతం ఐసీఐసీఐ ఏఎంసీ పీఈ రేషియో 49.38 ఉండగా.. హెచ్డ్పీఎఫ్సీ ఏఎంసీ పీఈ రేషియో 49.38, నిప్పాన్ ఇండియా ఏఎంసీ 51.10, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ 34, 46, యూటీఐ ఏఎంసీ 31.51 గా ఉంది. ఎస్బీఐ ఏఎంసీ 38.12 పీఈ రేషియోలో ఐపీఓగా వస్తుంది. కాగా ఐపీఓలో ఒక్కో షేరుకు రూ. 545-574 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతిలో జరుగుతుంది. ప్రమోటర్లైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), అముండి ఇండియా హోల్డింగ్ కలిసి ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలో తమ 10 శాతం వాటాను విక్రయించనున్నాయి.

Advertisement

యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జూలై 13న ప్రారంభం అవుతుంది. పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ జూలై 14 నుంచి జూలై 16 వరకు కొనసాగుతుంది. షేర్ల కేటాయింపు జూలై 17న ఖరారు కానుంది. షేర్లు జూలై 21న జరిగే లిస్ట్ కానున్నాయి. జూలై 20న రీఫండ్‌లు, షేర్ల క్రెడిట్ జరగనున్నాయి. ఎస్బీఐ ఏఎంసీ షేర్లు గ్రే మార్కెట్ లో 12 శాతం ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. ఒక్కో షేరు రూ.72 ఎక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా), ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జెఫరీస్ ఇండియా, జెఎం ఫైనాన్షియల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ , ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ఇష్యూకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నారు.