స్టాక్ మార్కెట్ లో మంచి రాబడి ఇచ్చే స్టాక్స్ ఉంటాయి. వాటిని గుర్తించి పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మంచి రిటర్న్స్ ఇస్తున్న స్టాక్ ల్లో వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఒకటి. వేదాంత గ్రూప్ డీమెర్జర్ స్టాక్ అయిన వేదాంత ఐరన్ అండ్ స్టీల్ షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన 20 రోజుల్లోనే భారీ రాబడిని ఇచ్చింది. మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తోంది. వరుసగా 1వ ట్రేడింగ్ సెషన్లలో భారీగా లాభాలు ఇస్తుంది. గురువారం సెషన్ లో కూడా స్టాక్ ధర భారీగా పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ లో 10 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకింది. ప్రస్తుతం రూ.42.65 వద్ద ట్రేడ్ అవుతోంది.
వేదాంత ఐరన్ & స్టీల్ స్టాక్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో జూన్ 15న లిస్ట్ అయింది. ఎన్ఎస్ఈలో రూ.20 వద్ద లిస్ట్ కాగా.. బీఎస్ఈలో రూ.22.25 వద్ద లిస్టయింది. అప్పటి నుంచి ఈ కంపెనీ స్టాక్ పాజిటివ్ గా ముందుకెళ్తోంది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పటి నుంచి 113 శాతం పెరిగింది. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఫేమస్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. అజీమ్ ప్రేమ్ జీకి చెందిన ప్రేమ్ జీ ఇన్వెస్ట్ తరఫున పీఐ ఆపర్చునిటీస్ ఏఐఎఫ్ విఎల్ఎల్పీ వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లో రూ.102 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది.
ఒక్కో షేరుకు రూ.21.02 చొప్పున రూ.101.68 కోట్ల విలువైన దాదాపు 4.84 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. స్టాక్ లో విపరీతమైన పెరుగుదలపై వేదాంత ఐరన్ అండ్ స్టీల్ స్పందించింది. స్టాక్ పెరుగుదలకు గల కారణాలను వివరించాలని స్టాక్ ఎక్స్చేంజీ లు తమని వివరణ కోరాయని మంగళవారం తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఎక్స్ఛేంజీలకు ఇచ్చామని ప్రకటించింది. అయితే వేదాంత నుంచి విడిపోయిన మిగతా స్టాక్ ల్లో కూడా ర్యాలీ కనిపించింది.
వేదాంత అల్యూమినియం మెటల్ షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. ఇంట్రాడే లో రూ.469.45కు చేరుకున్నాయి.
కంపెనీకి ఐసీఆర్ఏ ఏఏ+(స్టేబుల్) రేటింగ్ లభించడంతో వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు 13 శాతం పెరిగింది. ఇట్రాడేలో రూ.44.05 కు చేరుకుంది. వేదాంత పవర్ షేర్లు కూడా దాదాపు 8 శాతం వరకు పెరిగాయి. గరిష్ట స్థాయి రూ.47.78కు చేరుకుంది.మాతృ సంస్థ వేదాంత లిమిటెడ్ షేరు 1.5 శాతం పెరిగి రూ.279.80 వద్ద ట్రేడవుతోంది. కాగా వేదాంత ఐరన్ & స్టీల్ భారత్, ఆఫ్రికా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇనుప ఖనిజ అన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్ కు సంబంధించి కంపెనీ పని చేస్తోంది.
More Articles
- Multibagger Stock: ఒకే రోజు 20 శాతం పెరిగిన ఫార్మా స్టాక్.. ఒక నెలలోనే 43 శాతం జంప్..!
- Pharma Stocks: దూసుకెళ్లిన ఫార్మా స్టాక్స్.. ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు లాభాల పంట..!
- Indo Borax and Chemicals: భారీ డివిడెండ్ ప్రకటించిన కెమికల్ స్టాక్.. ఇన్వెస్టర్లకు పండగే..!
- Stock Market: 2026లో 9.37 శాతం క్షీణించిన స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా..
- స్టాక్ మార్కెట్కు బిగ్ షాక్.. US-ఇరాన్ సంక్షోభంతో రెడ్ జోన్లోకి సూచీలు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక
- Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఐటీ షేర్లు..!