వచ్చే వారం రెండు మెయిన్ బోర్డు ఐపీఓలు రానున్నాయి. వీటితో పాటు ఎస్ఎంఈ ఐపీఓలు కూడా రానున్నాయి. ఆర్డీ ఇండస్ట్రీస్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓలు మార్కెట్‌లోకి రానున్నాయి. ఎస్ఎంఈ విభాగంలో అనవిల్ వైర్ & ఇంజనీరింగ్, ఏజియస్ టెక్నాలజీస్ , LAPL ఆటోమోటివ్, ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ఐపీఓలు వచ్చే వారం బిడ్డింగ్ కోసం ప్రారంభం కానున్నాయి. ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీఓ ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 7న ముగుస్తుంది. ఈ కంపెనీ 'బుక్-బిల్ట్ ఇష్యూ' ద్వారా రూ.425.87 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.320 కోట్ల విలువైన 6.04 కోట్ల షేర్ల 'ఫ్రెష్ ఇష్యూ', రూ. 105.87 కోట్ల విలువైన 2 కోట్ల షేర్ల 'ఆఫర్ ఫర్ సేల్' ఉన్నాయి.

Advertisement

టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓ ఆగస్టు 7న ప్రారంభమై ఆగస్టు 11న ముగియనుంది. ఈ మెయిన్‌బోర్డ్ ఐపీఓ 1.19 కోట్ల షేర్లతో కూడిన బుక్-బిల్ట్ ఇష్యూ ఇందులో 0.95 కోట్ల షేర్ల ఫ్రెష్ ఇష్యూ, 0.24 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఎస్ఎంఈ విభాగంలో అనవిల్ వైర్ & ఇంజనీరింగ్ ఐపీఓ ఆగస్టు 3న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై ఆగస్టు 5న ముగియనుంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ రూ.177.81 కోట్ల విలువైన బుక్-బిల్ట్ ఇష్యూ. ఇందులో రూ.42.69 కోట్ల విలువైన 0.53 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.35.12 కోట్ల విలువైన 0.13 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి.

Advertisement

ఏజియస్ టెక్నాలజీస్ ఐపీఓ ఆగస్టు 4న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై ఆగస్టు 6న ముగియనుంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ రూ.23.71 కోట్ల విలువైన బుక్-బిల్ట్ ఇష్యూ, ఇది పూర్తిగా 0.23 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూగా రానుంది. LAPL ఆటోమోటివ్ ఐపీఓ ఆగస్టు 6న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ అనేది రూ.32.40 కోట్ల విలువైన 'బుక్ బిల్డ్' ఇష్యూ. ఇందులో పూర్తిగా రూ.32.40 కోట్ల విలువైన 0.34 కోట్ల కొత్త షేర్ల జారీ ఉండనుంది. మణిపాల్ హెల్త్ ఎంటర్పైసెస్ ఐపీఓ ఆగస్ట్ 3తో ముగుస్తుంది. ఆగస్ట్ 5న కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి.

Advertisement

జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కూడా వచ్చే వారం లిస్ట్ కానుంది. ఆగస్ట్ 6న ఆ కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి. ఎంవీ ఎలక్ట్రోసిస్టం ఐపీఓ షేర్లు కూడా వచ్చే వారం లిస్ట్ కానున్నాయి. ఆగస్ట్ 6న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.