పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన మిశ్రమ సంకేతాల నడుమ బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో పుంజుకున్నాయి. విదేశీ మార్కెట్ల ఆందోళనలను పక్కనపెట్టి.. ప్రధానంగా ఐటీ, కెమికల్ రంగాల షేర్లలోలభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్ సాగుతున్న కొద్దీ కొనుగోళ్ల జోరు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 701.41 పాయింట్లు (0.91%) పెరిగి 77,467.33 వద్ద ట్రేడవుతుండగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 205 పాయింట్లు (0.85%) పుంజుకుని 24,200 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50లో ఇన్ఫోసిస్, లార్సెన్ & టూబ్రో (ఎల్&టి), ఎటర్నల్ కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడి మార్కెట్లను ముందుకు నడిపాయి.
విస్తృత మార్కెట్‌లో కూడా కొనుగోళ్ల వాతావరణం కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.54% లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.66% మేర పుంజుకుంది. రంగాల వారిగా పరిశీలిస్తే.. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కెమికల్ రంగాలు అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా.. నిఫ్టీ రియల్టీ, ఆయిల్ & గ్యాస్ రంగాలు నష్టాలతో వెనుకబడ్డాయి. అంతకుముందు గిఫ్ట్ నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 24,231 వద్ద ట్రేడవుతూ దేశీయ మార్కెట్లలో బలమైన ప్రారంభానికి సంకేతాలు ఇచ్చింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.49%.. దక్షిణ కొరియా కోస్పి 2.08% మేర పడిపోగా, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1.45% లాభపడింది. అమెరికా మార్కెట్లలో డౌ జోన్స్ 1.03%, ఎస్&పి 500 0.21% పెరగ్గా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.22% నష్టంతో ముగిసింది.
పశ్చిమ ఆసియాలో అమెరికా సైనిక స్థావరంపై జరిగిన ఆకస్మిక బాలిస్టిక్ క్షిపణి దాడిని తిప్పికొట్టిన ఘటనతో ఉద్రిక్తతలు పెరిగి.. జూలై బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ 4.32% పెరిగి బ్యారెల్‌కు $87.72 కి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని 70% మంది భావిస్తుండగా.. పసిడి ఫ్యూచర్స్ 0.33% పడిపోయి, వెండి ఫ్యూచర్స్ 0.13% పెరిగాయి.
లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్.. ఐటీ, మెటల్ రంగాల దూకుడుతో నిఫ్టీ, సెన్సెక్స్ జోష్..
ఈ రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, డాబర్ ఇండియా, ఐషర్ మోటార్స్, వి-గార్డ్ వంటి ప్రధాన కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ప్రైమరీ మార్కెట్‌లో రూ. 9,275.22 కోట్ల విలువైన మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్, రూ. 53.94 కోట్ల హెచ్‌ఆర్ హైజీన్ ప్రాడక్ట్స్ ఐపీఓలు నేడు ప్రారంభం కాగా, ప్రాప్‌షాప్ ఈవెంట్స్ మరియు అడ్వాన్స్ టెక్నోఫోర్జ్ ఐపీఓలలో పెట్టుబడికి ఈరోజే చివరి అవకాశంగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- zepto IPO: ఐపీఓ వాల్యూవేషన్ను సవరించిన జెప్టో.. ఎందుకంటే..!
- లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్.. ఐటీ, మెటల్ రంగాల దూకుడుతో నిఫ్టీ, సెన్సెక్స్ జోష్..
- Johnson And Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా..!
- ASM Technologies: ఐదేళ్లలో 1,681 శాతం రాబడిని అందించిన ఏఎస్ఎం టెక్నాలజీస్..
- స్టాక్ మార్కెట్ అప్డేట్.. అస్థిరత మధ్య నిలకడగా సెన్సెక్స్-నిఫ్టీ.. టెక్ షేర్లలో జోష్..
- CXMT Listing: లిస్టింగ్ రోజే 535 శాతం రాబడి అందించిన స్టాక్..