దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ఆరంభించాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచి కుప్పకూలింది. చివరగా నష్టాలతో ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లలో కనిపించిన విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో పాటు.. అమెరికా-ఇరాన్ మధ్య రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీని ప్రభావంతో బీఎస్ఈ సెన్సెక్స్ 442 పాయింట్లు (0.57%) క్షీణించి 77,708.52 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 95.80 పాయింట్లు పడిపోయి 24,238.50 వద్ద ముగిసింది.
బెంచ్‌మార్క్ సూచీలు బలహీనపడినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ వంటి విస్తృత మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో సానుకూల ప్రదర్శనను కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.27%, స్మాల్‌క్యాప్ సూచీ 0.03% స్వల్ప లాభపడ్డాయి. రంగాల విషయానికొస్తే, ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోగా, నిఫ్టీ ఫార్మా, మెటల్, హెల్త్‌కేర్ విభాగాలు లాభాల్లో పయనించాయి.
యాక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు $90 డాలర్లకు చేరడం భారత్‌కు ప్రధాన సవాలుగా మారింది. చమురు ధరలు సుదీర్ఘకాలం గరిష్ట స్థాయిలో ఉంటే దేశీయ ద్రవ్యోల్బణం పెరిగి, దిగుమతి భారం తీవ్రమవుతుంది. సాంకేతికంగా నిఫ్టీకి 24,200 మద్దతు స్థాయి (Support) అత్యంత కీలకమైనది.
స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు కుప్పకూలింది.. షేర్ల పతనం వెనుక మూడు ప్రధాన కారణాలు ఇవే..
ఒకవేళ ఈ స్థాయి దిగువకు జారితే సూచీ 24,000 నుండి 23,800 స్థాయిలకు పడిపోయే ప్రమాదం ఉంది. పైదిశగా 24,450 కీలక నిరోధకంగా (Resistance) పనిచేస్తుందని, దీన్ని దాటితే నిఫ్టీ 24,600 - 24,700 వైపు ర్యాలీ తీసే అవకాశం ఉందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో మార్కెట్ గమనం ప్రధానంగా చమురు ధరలు, పశ్చిమ ఆసియా పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు కుప్పకూలింది.. షేర్ల పతనం వెనుక మూడు ప్రధాన కారణాలు ఇవే..
- రూ.200లోపు బెస్ట్ స్టాక్స్.. ఈ మూడు షేర్లపై ఫోకస్ పెట్టమంటున్నమెహుల్ కొఠారి..
- Stock Market: ఐటీ కంపెనీల్లో కొత్త ఊపు..భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
- స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సూచీలను ముందుకు నడిపించిన ఐటీ షేర్లు..
- స్టాక్ మార్కెట్ క్లోజింగ్ బెల్.. లాభాల్లో ముగిసిన సూచీలు.. పడిపోకుండా కాపాడిన ప్రభుత్వ రంగ బ్యాంకులు..
- స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. 5 సెకన్లలో రూ.1 లక్ష కోట్ల సంపద మాయం.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ..