ప్రమోటర్లకు అనుబంధంగా ఉన్న సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఆస్తులను మళ్లించినందుకు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొరఢా ఝలిపించింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ తో పాటు దాని ప్రమోటర్లైన సుభాద్ చంద్ర, పునీత్ గోయెంకాలకు రూ.1.5 కోట్ల జరిమానా విధించడంతో పాటు, వారిని ఒక సంవత్సరం పాటు స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించింది. హైదరాబాద్‌లోని కంపెనీ భూముల పత్రాలను అనధికారికంగా తాకట్టు పెట్టినందుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

ప్రమోటర్ల యాజమాన్యంలోని సంస్థ అయిన ఎస్సెల్ గ్రూప్, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.726 కోట్లు రుణం తీసుకోవడానికిజీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆస్తిని తాకట్టు పెట్టింది. బోర్డు, ఆడిట్ కమిటీ ఆమోదం లేకుండా భూములు తాకట్టు పెట్టింది. అంతే కాకుండా ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదని ఆడిట్ లో తేలింది. "ఈ లావాదేవీ గురించి తెలిసి ఉన్నప్పటికీ, గోయెంకా దానిని బోర్డుకు, ఆడిట్ కమిటీకి, చట్టబద్ధమైన ఆడిటర్లకు వెల్లడించడంలో విఫలమయ్యారని సెబీ పేర్కొంది. ఈ లావాదేవీకి సంబంధించిన ఎలాంటి వివరాలను ఈ సంవత్సరాల ఆర్థిక నివేదికలలో వెల్లడించలేదని తెలిపింది.

Advertisement

జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ సంవత్సరాల తరబడి పెట్టుబడిదారులకు, స్టాక్ ఎక్స్ఛేంజీలకు లేదా ఆర్థిక నివేదికలలో ముఖ్యమైన పరిణామాలను వెల్లడించడంలో విఫలమైంది. అంతేకాకుండా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ వాటాదారులకు తప్పుడు, అసత్య, తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందిస్తూ శ్రీ గోయెంకా సీఈఓ-సీఎఫ్‌ఓ సర్టిఫికేట్‌పై సంతకం చేశారని సెబీ కనుగొంది. ఈ నోటీసులు అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, వెల్లడింపు నిబంధనలను ఉల్లంఘించాయని నిర్ధారించిన తర్వాత, సెబీ జీల్ (ZEEL)ను రెండు నెలల పాటు స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధించింది.

గోయెంకా, చంద్రలకు చెరో 12 నెలల పాటు స్టాక్ మార్కెట్ నుంచి నిషేధించింది. అంతేకాకుండా, సెబీ జీల్‌కు రూ.30 లక్షలు, గోయెంకాకు రూ.58 లక్షలు, చంద్రకు రూ.60 లక్షల జరిమానా విధించింది. ఉత్తర్వు అందిన తేదీ నుంచి మూడు నెలలలోపు లేదా గడువు ముగిసేలోపు, ఏది ముందు అయితే దానిలోపు, తెరిచి ఉన్న ఏవైనా డెరివేటివ్ పొజిషన్‌లను మూసివేయాలని కూడా నోటీసులను ఆదేశించింది. తుది ఉత్తర్వు అందిన తేదీ నుంచి 45 రోజులలోపు జరిమానాను చెల్లించాలని కూడా సెబీ ఆదేశించింది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.