జెప్టో ఐపీఓ త్వరలో రానుంది. కంపెనీ ఐపీఓ అనంతర విలువను మొదటగా 5 బిలియన్ డాలర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు అంచనాను తగ్గించి ఐపీఓ అనంతర విలువను 3 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు బిజినెస్ వెబ్ సైట్స్ పేర్కొంటున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో స్విగ్గీ, ఎటర్నల్ షేర్లు ఈరోజు పుంజుకున్నాయి. జెప్టో భారీగా నిధులు సేకరించి వేగంగా తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే భారీ నగదు వ్యయానికి నిధులు సమకూర్చడానికి పబ్లిక్ మార్కెట్ పెట్టుబడిదారులు సుముఖత చూపడం లేదని సూచిస్తోందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
దీంతో మిగతా కంపెనీలు డిస్కౌంట్లు, డార్క్-స్టోర్ విస్తరణ కస్టమర్లను సంపాదించుకోవడంపై భారీగా ఖర్చు చేసే కంపెనీ సామర్థ్యం తగ్గవచ్చని చెబుతున్నారు. తద్వారా లిస్టెడ్ ప్రత్యర్థులైన స్విగ్గీ, ఎటర్నల్‌పై పోటీ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో జూలై 28న మధ్యాహ్నం సుమారు 1 గంటకు స్విగ్గీ షేర్లు దాదాపు 4 శాతం పెరిగి రూ. 268 వద్ద ఉండగా, ఎటర్నల్ 3 శాతం లాభపడి రూ. 305కు చేరుకుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా క్విక్-కామర్స్ రంగంలో పోటీని తీవ్రతరం చేసినప్పటికీ, జెప్టోలా కాకుండా, ఈ రెండు లిస్టెడ్ ప్రత్యర్థులకు అవసరమైతే పోటీ పడటానికి ఇప్పటికే గణనీయమైన బ్యాలెన్స్ షీట్ బలం ఉంది.
జూన్ త్రైమాసికం చివరి నాటికి స్విగ్గీ వద్ద సుమారు రూ. 10,800 కోట్ల నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు ఉండగా, ఎటర్నల్ వద్ద దాదాపు రూ. 16,000 కోట్ల నగదు, లిక్విడ్ పెట్టుబడులు ఉన్నాయి. జెప్టో యాజమాన్యం, సవరించిన పోస్ట్-మనీ వాల్యుయేషన్ సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 29,000 కోట్లు)పై పెట్టుబడిదారులతో చర్చలు ప్రారంభించిందని, దీని ప్రకారం ప్రీ-మనీ వాల్యుయేషన్ సుమారు 2.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 24,000 కోట్లు)గా ఉంటుందని జూలై 27న మనీకంట్రోల్ పేర్కొంది.
సంస్థకు, పెట్టుబడిదారులకు మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ వారం కూడా అవి కొనసాగే అవకాశం ఉంది. బిడ్లు రావాల్సి ఉంది, కాబట్టి వాల్యుయేషన్ లేదా డీల్ స్వరూపంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. సవరించిన వాల్యుయేషన్ ఆధారంగా బుక్‌ను రూపొందిస్తే, ఐపీఓలో సుమారు రూ. 5,000 కోట్ల ప్రైమరీ ఇష్యూ ఉండనుంది. జెప్టో తన ఐపీఓకు ఏప్రిల్‌లో సెబీ ఆమోదం తెలిపింది. అప్పుడు మార్కెట్ అంచనాల ప్రకారం దాని విలువ సుమారు 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆగస్ట్ లో జెప్టో ఐపీఓ రానుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- లాభాల్లో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్.. ఐటీ, మెటల్ రంగాల దూకుడుతో నిఫ్టీ, సెన్సెక్స్ జోష్..
- Johnson And Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా..!
- ASM Technologies: ఐదేళ్లలో 1,681 శాతం రాబడిని అందించిన ఏఎస్ఎం టెక్నాలజీస్..
- స్టాక్ మార్కెట్ అప్డేట్.. అస్థిరత మధ్య నిలకడగా సెన్సెక్స్-నిఫ్టీ.. టెక్ షేర్లలో జోష్..
- CXMT Listing: లిస్టింగ్ రోజే 535 శాతం రాబడి అందించిన స్టాక్..
- Multibagger stock: ఐదేళ్లలో 350 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్..