వరుసగా ఐదో రోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో మదుపరులు రూ. లక్షల కోట్ల నష్టాలను చవి చూశారు. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 332 పాయింట్లు పతనమై 76,059.77 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 102 పాయింట్లు క్షీణించి 23,767.45 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.10 శాతం పడిపోగా.. స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.32 శాతం మేర నష్టపోయింది. హెచ్‌సిఎల్ టెక్, సిప్లా, విప్రో ఈ సూచీలో అత్యధిక లాభాలను ఆర్జించిన షేర్లుగా నిలిచాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో 1.10% నష్టపోగా, మెటల్, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ రంగాలు 0.50 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ మీడియా దాదాపు 2 శాతం పెరిగింది. నిఫ్టీ ఐటీ 0.82 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.58 శాతం పెరిగింది, నిఫ్టీ బ్యాంక్ 0.18 శాతం పెరిగింది.
ఎఫ్‌ఎంసిజి మినహా, ఎన్‌ఎస్‌ఈ లోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ట్రెంట్, మారుతి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐఎన్, రిలయన్స్, టెక్ మహీంద్రా లాభాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బీఈఎల్, టైటాన్, ఎల్అండ్ టీ, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండిగో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, ఎటర్నల్ నష్టాల్లో ముగిశాయి.
ప్రధానంగా ముడి చమురు ధర భారీగా పెరగడంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటింది. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉంది. ముడి చమురు ధర పెరిగితే ఇండియాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముడి చమురు ధర పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వస్తుంది. ఫలితంగా అన్నింటి ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం కూడాపెరుగుతుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించడం కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. అమెరికా ప్రభుత్వం గత రెండు వారాల్లో బ్రెజిల్‌పై 25 శాతం, కెనడాపై 50 శాతం, జెనరిక్ మందులపై 200 శాతం వరకు సుంకాలను ప్రకటించింది. గురువారం నాడు ఏకంగా 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 12.5% వరకు సుంకాలను విధించింది. అమెరికా సెక్షన్ 301 కింద పలు దేశాలపై 10 శాతం, 12.5 శాతం కొత్త సుంకాలను ప్రకటించగా, భారత్ పై 10 శాతం సుంకం ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో కొన్ని కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇది కూడా మార్కెట్ పై ప్రభావం చూపింది. ఇండిగో జూన్ త్రైమాసికానికి రూ. 238 కోట్ల నికర నష్టాన్ని నివేదించడంతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 2 శాతానికి పైగా పడిపోయింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు కూడా ఆశజనకంగా లేవు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More Articles
- Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడిపోయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ షేర్లు..!
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్ల కొంపలు ముంచిన ట్రంప్.. ఈ రంగాలకు భారీ నష్టాలు..
- స్టాక్ మార్కెట్ 4వ రోజు కూడా ఢమాల్.. వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల కంట రక్త కన్నీరు.. ఎందుకు ఇంతలా షేర్ల పతనం.. ?
- Zomato: రూ. 92 కోట్లకు చేరిన జొమాటో లాభం.. ఇప్పుడు స్టాక్ కొనచ్చా!
- Multibagger stock: ఐదేళ్లలో 354 శాతం రాబడి ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Pharma Sector Mutual Funds: ఐదేళ్లలో మంచి రాబడి ఇచ్చిన ఫార్మా మ్యూచువల్ ఫండ్లు..!